
శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టే, భార్యల రూపంలో, చెల్లెళ్ళ రూపంలో మన ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు అంటూ ఓ సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు సరిగ్గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు చెల్లెళ్ళ రూపంలో గండం పార్టీ గడప దాకా వచ్చింది.
ఇటు ఏపీ విషయానికొస్తే 2024 ఎన్నికలకు ముందే షర్మిల రూపంలో వైసీపీ ని తాకింది ఈ చెల్లి గండం. తుఫాన్ తీరం దాటాక దాని తాలూకా విధ్వంశం తీర ప్రాంతాలలో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అదే మాదిరి షర్మిల ఏపీ రాజకీయాలను తాకక వైసీపీ అంతటి ప్రళయాన్ని చూసింది.
Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…
షర్మిల నోటి నుంచి ఎప్పుడు ఏ ప్రకటన వస్తుందో.? అది వైసీపీ ని ఏ మేరకు ముంచేస్తుందో.? అన్న భయం అటు పార్టీ అధినేతగా వైస్ జగన్ నుంచి ఇటు పార్టీ క్యాడర్ వరకు అందరికి హడలు పుట్టించింది. ఒక రకంగా షర్మిల రాజకీయ ప్రకటనలకు వైసీపీ కౌంటర్ కూడా వేయలేని దీన స్థితికి వచ్చేసింది అంటే అతిశయోక్తి కాదేమో అని చెప్పాలి.
ఇప్పటికి వైసీపీ షర్మిల అనే చెల్లి గండం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇక ఇప్పుడు ఇదే సమస్య తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీకి రానుందా అంటే భవిష్యత్లో ఏదైనా సాధ్యమే అనేటట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read – కమ్మవారి ఊసు జగన్ కేల?
నేడు కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రకి రాసిన లేఖాస్త్రం తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. కవిత లేఖ అటు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లకు ఒక ఆయుధంతో కనిపిస్తుంటే ఇటు బిఆర్ఎస్ కు అదొక అణుబాంబులు తోస్తుంది.
ఇప్పటి వరకు కవిత లేఖ మీద బిఆర్ఎస్ పార్టీ నోరు మెదపలేని దుస్థితిలో ఉంది. కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా తలెత్తి సమాధానం చెప్పుకోలేని గడ్డు పరిస్థితిని బిఆర్ఎస్ ఎదుర్కొంటుంది.అసలు ఆ లేఖ కవిత రాసిందా.? లేఖ ప్రత్యర్థుల సృష్టా.? అన్న ప్రశ్నకు కూడా బిఆర్ఎస్ వద్ద సమాధానం లేదు.
Also Read – వైసీపీలకి పవన్ వార్నింగ్… అబ్బే డోస్ సరిపోదు!
అయితే మొన్నీమధ్య కవిత సోది చెప్పించుకునే పేరుతో తన మనసులో ఉన్న ముఖ్యమంత్రి ఆశను భయటపెట్టిందని, జాగృతి పేరుతో కవిత ఎప్పుడు తన రాజకీయ భవిష్యత్ పై జాగృతంగానే ఉంటారని, అందుకు నిదర్శనమే ఇప్పుడు ఈ లేఖ అంటూ తెలంగాణ రాజకీయాలలో కవిత లేఖ మీద చర్చ జరుగుతుంది.
ఇక ఏపీలో వైసీపీ ఫ్యాన్ కు షర్మిల స్పీడ్ బ్రేకర్ గా నిలిస్తే, ఇప్పుడు బిఆర్ఎస్ కారుకు కవిత బ్రేక్ గా మారనున్నారా అనేది మరికొద్ది రోజులలోనే తేలనుంది. అయితే అటు వైసీపీ, ఇటు బిఆర్ఎస్ రెండు పార్టీలలో అన్నలకు చెల్లెళ్ళ రూపంలో రాజకీయ గండం మాత్రం తప్పదేమో అంటున్నారు విశ్లేషకులు.