
తరచూ యజ్ఞయాగాలు చేసే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంటే నమ్మగలమా? కానీ తిరుగుతున్నాయని ఆయన కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు.
ఆమె తండ్రికి వ్రాసిన లేఖ బయటకు లీక్ అవడంతోనే బిఆర్ఎస్ పార్టీలో పెను విస్పోటనమే జరిగింది. శుక్రవారం రాత్రి ఆమె అమెరికా నుంచి తిరిగి రాగానే శంషాబాద్ విమానాశ్రయం వద్దే మీడియాతో మాట్లాడుతూ మరిన్ని బాంబులు పేల్చారు.
Also Read – కేసీఆర్ రాజకీయాలలో పాల్గొనగలరా?
పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ లేఖ తాను వ్రాసినదే అని కుండబద్దలు కొట్టారు. కానీ తాను రెండు వారాల క్రితం వ్రాసిన ఆ లేఖ బయటకు లీక్ అయ్యిందంటే బిఆర్ఎస్ పార్టీలో కోవర్టులున్నారని, వారు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అందరూ గ్రహించాలని కల్వకుంట్ల కవిత అన్నారు.
బయట ప్రజలు, పార్టీలో చాలా మంది అనుకుంటున్న విషయాలనే తాను ఆ లేఖలో పేర్కొన్నాను తప్ప ప్రత్యేకమైనవేమీ లేవని కల్వకుంట్ల కవిత అన్నారు.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
కేసీఆర్ కూతురునైన తాను వ్రాసిన లేఖనే లీక్ చేయగలిగితే పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని అందరూ ఆలోచించుకోవాని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్ దేవుడు వంటివారు కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయి. అవే ఆయనని తప్పు దారి పట్టిస్తున్నాయి అని అన్నారు కల్వకుంట్ల కవిత.
Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
పార్టీలో చిన్న చిన్న లోపాలు సవరించుకొని ముందుకు సాగితే బిఆర్ఎస్ పార్టీ తిరుగు ఉండదన్నారు కల్వకుంట్ల కవిత అన్నారు.
కాంగ్రెస్, బీజేపిల వలన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కేవలం కేసీఆర్ మాత్రమే వాటికి ఏకైక ప్రత్యామ్నాయమని అన్నారు.
ఆ లేఖని కాంగ్రెస్ పార్టీయే పుట్టించి సర్క్యులేట్ చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ అది తాను వ్రాసిన లేఖే అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేయడంతో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీయే ఇరుకున పడింది.
ఆమె చెప్పిన కేసీఆర్ చుట్టూ తిరుగుతున్న దెయ్యాలు బహుశః కేటీఆర్, హరీష్ రావులేనని వేరే చెప్పక్కరలేదు. కేసీఆర్ వారిరువురినే నమ్ముతున్నారు. వారితోనే అన్ని విషయాలు చర్చిస్తున్నారు కనుక.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే వారిరువురే పార్టీని నడిపిస్తున్నారు. అప్పటి నుంచే పార్టీలో కవితకి ప్రాధాన్యం తగ్గింది. కేసీఆర్ కూడా ఆమెను పక్కనపెట్టేశారు. కనుకనే ఆమె లేఖ వ్రాయాల్సి వచ్చిందని స్పష్టమవుతోంది. ఆమె కేసీఆర్ కూతురు అయినప్పటికీ ఈవిదంగా మాట్లాడటం వలన పార్టీకి అప్రదిష్ట కలగడంతో పాటు పార్టీకి నష్టం జరుగుతోంది. కనుక ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
ఒకవేళ ఆమె కూతురనే కారణంతో కేసీఆర్ ఆమెను పార్టీలో ఉంచుకున్నా, ఆమె వలన ఈ లుకలుకలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. అలాగని ఆమె కోసం కేటీఆర్ లేదా హరీష్ రావులను వదులుకోలేరు. కనుక ఆమెనే వదులుకోక తప్పదు. వదులుకుంటే తీసుకునేందుకు బీజేపి సిద్దంగా ఉంది కూడా.
కానీ ఆమెని బీజేపిలో చేర్చుకోవాలంటే కేసీఆర్ అండ్ కోపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ, ఫామ్‌హౌస్ రహస్యాలన్నీ బయటపెట్టక తప్పదు. బీజేపి పట్ల చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ఇది తప్పనిసరి.
కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మరి కొన్నేళ్ళు కొనసాగాలనుకుంటున్నారు. కనుక ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పక బీజేపిలో చేరే అవకాశం ఉంది. కనుక బిఆర్ఎస్ పార్టీలో మరిన్ని ప్రకంపనలు తప్పవు,