
ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని అధికారం చలాయించినందున ఎన్నికలలో ఓడిపోవడం వలన నేటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read – కాంట్రవర్సీ లో కీరవాణి?
కానీ తాము తమ అహంభావం, వైఫ్యల్యాలు, అవినీతి వలన కాక ప్రత్యర్ధులు మాయమాటలను ప్రజలు నమ్మడం వలననే ఓడిపోయామని వారిరువురూ గట్టిగా నమ్ముతున్నారు.
వారు నమ్మితే పరవాలేదు కానీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తమ పాలన ఓ స్వర్ణయుగమని, కనుక తాము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని వాదిస్తున్నారు.
Also Read – సెలబ్రెటీలు తస్మాత్ జాగ్రత్త..!
రాజకీయాలలో ఎవరి ఆశలు, వాదనలు వారికుంటాయి. కనుక వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏడాదిన్నరగా శాసనసభకు మొహం చాటేస్తున్న కేసీఆర్, వీలైనంత త్వరగా అధికారంలోకి వచ్చేయాలని ఆరాటపడుతుందటమే చాలా హాస్యాస్పదంగా ఉంది.
పార్టీ ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చేయడమో లేదా వారిచేత రాజీనామాలు చేయించగలిగితే ఉప ఎన్నికలు వస్తాయని, వాటిలో తామే గెలుస్తామని, అప్పటి నుంచి తమకు పూర్వ వైభవం మొదలవుతుందని కేసీఆర్ ఆశ పడుతున్నారు.
Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?
ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి తగిన విదంగా సమాధానం చెప్పారు. శాసనసభలో మాట్లాడుతూ, “నాడు 2014 నుంచి 2023 వరకు మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు. మా ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు మీకు అది తప్పుగా అనిపించలేదు.
వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరినా పట్టించుకోలేదు. న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో కలుగజేసుకోలేదు.
అప్పుడున్న రూల్ బుక్, చట్టాలు, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగమే ఇప్పుడూ ఉంది. కనుక అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అలాగే జరుగుతుంది తప్ప వేరేలా జరుగదు కదా?
కనుక ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయని ఆశించవద్దు. ఒకవేళ వస్తాయని పగటికలలు కనాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా చేశారు. “ఒకవేళ జమిలి ఎన్నికలు జరిపించాలని కేంద్రం అనుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ళ పాలన ముగిసే సమయంలోనే అంటే 2029లోనే జరుపుతుంది తప్ప ముందుగా జరుపుకొని నష్టపోవాలనుకోదు. ఆ లెక్కన మా ప్రభుత్వానికి 2028 డిసెంబర్ నుంచి అదనంగా మరో ఆరు నెలలు లభిస్తుంది. కనుక అంతవరకు కేసీఆర్ ఓపిక పట్టాల్సిందే. ఆయన కోరుకుంటే ఎన్నికలు రావు,” అని అన్నారు.