KCR Jagan Chandrababu

ఒక ప్రభుత్వాధినేత రాజకీయంగా ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకునేందుకు తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సిఎం చంద్రబాబు నాయుడు కూడా గతంలో రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేశారు. కానీ కేసీఆర్‌లా అహంభావంతో గుడ్డిగా ముందుకు సాగకుండా తప్పులు సరిదిద్దుకున్నారు. అందుకే కేసీఆర్‌ ఎన్నికలలో ఓడిపోగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..

మళ్ళీ ఓసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీపై కత్తులు దూస్తూండేవారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌ వచచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్‌ ఆయనకు స్వాగతం పలకాల్సి ఉండగా మంత్రి తలసానిని పంపించేవారు.

ప్రధాని మోడీకి స్వాగతం పలుకకపోగా ఆయనని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ నగరమంతటా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించేవారు.

Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్‌ జీర్ణించుకోగలవా?

ఇవన్నీ తెలంగాణ కోసం చేస్తున్న పోరాటాలని ప్రజలను నమ్మించేవారు. కానీ ప్రధాని మోడీని కేసీఆర్‌ ఇంతగా అవమానించడం వలననే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి, దక్కాల్సినవి దక్కకుండాపోయాయని తెలంగాణ ప్రజలకు అర్దమయ్యే ఉంటుంది. కేసీఆర్‌ ధోరణి కారణంగానే కూతురు కవిత జైలు పాలయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది కూడా. కనుక ఒక నాయకుడు లేదా పాలకుడి ధోరణి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం, ప్రజలు, చివరికి ఆ పార్టీ ఎంతగా నష్టపోతుందో తెలంగాణలో కనపడింది.

అయితే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌లా అహంభావంతో వ్యవహరించకుండా ప్రధాని మోడీ వచ్చినప్పుడు, తిరిగి వెళుతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి మర్యాద చూపుతున్నారు.

Also Read – మంగళగిరి మొనగాడెవరు.?

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరమని తెలుసు కనుక పార్టీలకు అతీతంగా ప్రధాని మోడీ పట్ల విధేయంగా ఉంటూ నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ప్రయత్నలోపం లేకపోయినా, రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల వలన, కాంగ్రెస్‌, బీజేపిల మద్య ఉన్న రాజకీయ శతృత్వం కారణంగా తెలంగాణ మళ్ళీ కొంత నష్టపోతోందని చెప్పక తప్పదు.

కానీ సిఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒకటొకటిగా సాధించుకుంటూనే ఉన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చెడితే ఏమవుతుందో తెలంగాణలో కనిపిస్తోంది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమితో ఏపీలో కూడా కనపడింది. ఆ ప్రభావం 2024 ఎన్నికల వరకు అలాగే ఉంది.

కానీ ముందే చెప్పుకున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ తప్పిదాలను సరిదిద్దుకోవడమే కాకుండా ఎన్ని విమర్శలు ఎదరవుతున్నా బేషజాలు పక్కన పెట్టి మళ్ళీ ప్రధాని మోడీతో చేతులు కలిపారు. ఒక రాజకీయ నాయకుడికి, పాలకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే.

చంద్రబాబు నాయుడు పట్టు విడుపుల కారణంగానే నేడు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అమరావతి, పోలవరం, బనకచర్లతో సహా పలు ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీలు, ఉన్నత విద్యాసంస్థలు, కార్యాలయాలు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో రైల్, రోడ్‌, విమాన ప్రాజెక్టులు చకచకా పరుగులు పెడుతున్నాయి. ఈరోజు విశాఖలో జరిగిన అంతర్జాతీయ దినోత్సవానికి ప్రధాని మోడీ రావడం, సిఎం చంద్రబాబు నాయుడుని ప్రశంశించడం ఇందుకు తాజా నిదర్శనం.

ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌-జగన్‌ ముగ్గురినీ, వారి పని తీరు, వారి రాజకీయలు, ఆలోచనా విధానాలను ఒకసారి బేరీజు వేసుకొని చూసినట్లయితే, ముగ్గురిలో సిఎం చంద్రబాబు నాయుడు వైఖరి విజయవంతమైనదని నిరూపితమవుతోంది. కనుక కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ చంద్రబాబు నాయుడుని చూసి ఏమైనా నేర్చుకుంటే వారికే మేలు కలుగుతుంది.