ఇదివరకు రాజకీయ ప్రముఖులకు సన్-స్ట్రోక్స్ తగిలి వారి రాజకీయ జీవితం తారుమారు అవుతుండేది. ఇప్పుడు సిస్టర్ స్ట్రోక్స్, డాటర్ స్ట్రోక్స్ కూడా తోడయ్యాయి.
ఇందుకు చక్కటి నిదర్శనంగా వైఎస్ షర్మిల-జగన్ మన కళ్ళ ముందే ఉన్నారు. వారిరువురి మద్య ఆస్తి పంపకాల పంచాయితీ.. ఆ ఫ్లాష్ బ్యాక్‌తో వారి మద్య జరుగుతున్న రాజకీయ రగడ అందరూ చూస్తూనే ఉన్నారు.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్ తగిలింది. డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురు కల్వకుంట్ల కవిత చిక్కుకొని జైలు పాలవడంతో ఆయన జాతీయ రాజకీయాలలో కాదుకదా.. పక్కనే ఉన్న మహారాష్ట్ర ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీని బరిలో దించలేకపోయారు.
ఆ కేసు కారణంగానే అంతకు ముందు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు కూడా దూరంగా ఉండిపోవలసి వచ్చిందని టాక్. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ సీట్లను కూడా అందుకే బీజేపికి వదిలేసుకోవలసి వచ్చిందని గిట్టనివారు గుసగుసలు ఆడుకుంటూనే ఉన్నారు.
Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
ఇవన్నీ దుష్ప్రచారమే అని కొట్టి పడేసినా, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. కనుక డాటర్ స్ట్రోక్ తగిలిందనే అనుమానించాల్సి ఉంటుంది.
ఇక్కడ జగన్‌కు సిస్టర్ స్ట్రోక్ తగిలినట్లే, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్‌కు కూడా అక్కడ సిస్టర్ స్ట్రోక్ తగిలినట్లే ఉంది.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
చెల్లి మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవడంతో ఆయన అలిగి రాజకీయాలకు ‘సిక్ లీవ్’ పెట్టేసి కేరళ వెళ్లిపోయారని గిట్టనివారు గుసగుసలు ఆడుకుంటున్నారు.
వారి గుసగుసలు నిజమేనేమో అని అనుమానం రేకెత్తించేలా, కల్వకుంట్ల కవిత నేటి నుంచి ఫుల్ టైమ్ రాజకీయాలు ప్రారంభించేశారు.
ముందుగా తనకు ఇంత గుర్తింపు, రాజకీయాలలో ఎదుగుదలకి కారణమైన తెలంగాణ జాగృతి 2.0 వెర్షన్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. అంటే ఆమె కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుందా లేక తెలంగాణ మహిళల కోసం పనిచేస్తుందా?అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
నేటి నుంచి ఈ నెల 8 వరకు జిల్లాల వారీగా తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ విషయం చెప్పే ముందు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశయించి “పీకేయడానికి కేసీఆర్ మీ పెరట్లో మొక్క కాదు.. వేగుచుక్క.. ఆయనని టచ్ చేయడం మీవల్ల కాదు,” అని ఓ పంచ్ డైలాగ్ కొట్టారు కూడా. అంటే కల్వకుంట్ల కవిత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయిన్నట్లే కదా?
కనుక కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఇద్దరూ మళ్ళీ ఎప్పటిలాగే సమాంతరంగా రాజకీయాలు చేసుకుంటారా లేక గిట్టనివారు చెప్పుకుంటున్నట్లు కల్వకుంట్ల కవిత అన్నని బైపాస్ చేసి బిఆర్ఎస్ పార్టీని చేతిలోకి తీసుకుంటారా?రాబోయే రోజుల్లో తెలుస్తుంది.