
ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరూ ఎన్నికలలో ఒడిపోయినప్పటి నుంచి గృహ నిర్బంధం విధించుకొని ప్రజలకు దూరంగా ఉంటున్నారు.
Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!
సంక్రాంతి తర్వాత రిలీజ్ అని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ గ్రహస్థితి, ముహూర్తం, వాస్తు అన్నీ చూసుకోవాలి కనుక ఓ నెల ఆలస్యమైనా ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఈ 19న ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వస్తున్నారు.
బుధవారం మద్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగబోతోంది పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు.
Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!
కనుక పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు అందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతూ “నేను కొడితే గట్టిగానే దెబ్బ కొడతాను. మెల్లగా కొట్టే అలవాటు నాకు లేదు,” అన్నారు.
Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?
కేసీఆర్ రిలీజ్ డేట్ ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందే బిఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు “రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ఆరు నెలలకంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు,” అని అన్నారు.
ఇవి యధాలాపంగా అన్న మాటలేనా? లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్ మళ్ళీ ఏదైనా పెద్ద ప్లాన్‌తో వస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.
కానీ కేసీఆర్ ఒక్కరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరగదోయలేరు. కనుక ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి ఏమైనా హామీ లభించిందా?అందుకే ఇప్పుడు బయటకు వస్తున్నారా? కేసీఆర్ భవిష్య కార్యాచరణ ఇదేనా?అనే సందేహం కలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ ఓటమి షాక్ నుంచి తేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ గ్యాప్‌లో తాను ‘మౌనంగా, గంభీరంగా రేవంత్ రెడ్డి అస్తవ్యస్త పాలన నిశితంగా గమనిస్తున్నానని’ కేసీఆర్ చెప్పుకున్నారు. ఏడాది గ్యాప్ తీసుకుని ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అవగాహనతో కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు కనుక మళ్ళీ తెలంగాణలో వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలతో పాటు రాజకీయాలలో కూడా వేడి చాలా పెరుగుతుంది.
తెలంగాణ సింహం బోనులో నుంచి బయటకు వస్తోంది. కానీ మన యువ సింహం ఇంకా తాడేపల్లి ప్యాలస్‌లోనే ఒంటరిగా తిరుగుతోంది. ఈ రెండు సింహాలు ఇంచుమించు ఒకే పరిస్థితిలో ఉన్నందున ఈ గ్యాప్‌లో ఏమైనా మాట్లాడుకొని, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని ఉంటే మన సింహం కూడా త్వరలోనే బయటకు వచ్చేస్తుంది.