వైసీపి అధినేత వరద బాధితులకి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. దానిలో భాగంగా పాలు, నీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేయించిన్నట్లు ఫోటోలు వైసీపి సోషల్ మీడియాలో వేసుకుంది. వాటితో కోటి రూపాయలకి లెక్క సరిపోయిందని అనుకున్నారో ఏమో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరళంగా జగన్‌కి సమర్పించుకుంటున్నారు.
అదికూడా సరిపోదన్నట్లు ఓ చిన్నారి కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్ముని షిక్కటి షిర్నవ్వుతో అందుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు పంచిపెట్టానని గొప్పగా చెప్పుకునేవారు. ఎన్నికలలో ఓడిపోయినా జగన్ ఓ పదో పాతికో కోట్లు విరాళంగా ఈయగల ఆర్ధిక స్థోమత ఉన్నవారే. కానీ కోటి రూపాయలే ప్రకటించారు. అది కూడా ఎక్కడ ఖర్చయిపోయిందో తెలీదు కానీ వరద బాధితుల పేరిట వైసీపిలో కలెక్షన్ మొదలైందని స్పష్టం అవుతోంది.
Also Read – అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?
వైసీపిలో ఇలా ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన్నట్లుగానే నేడు సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి కోటి రూపాయల చెక్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. పంచాయితీలకు ఇస్తానన్న నాలుగు కోట్ల రూపాయలు నేరుగా వాటి బ్యాంక్ ఖాతాలలోనే జమా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
జగన్, పవన్ ఇంచుమించు ఒకే సమయంలో విరాళాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అప్పుడే కోటి రూపాయల చెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించగా, జగన్ మాత్రం విరాళాలు పుచ్చుకుంటున్నారు. అవును వరద బాధితుల కోసమేనట!