kodali-nani-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కోల్‌కత్తా విమానాశ్రయం నుంచి కొలంబో బయలుదేరుతుండగా ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త గుప్పుమంది.

ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమనాశ్రయంలో, అంతకు ముందు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఇలాగే పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకు వచ్చినందున, కొడాలి నాని కొలంబో పారిపోబోతుంటే అరెస్ట్‌ చేసి ఉండవచ్చని అందరూ భావించడం సహజం.

Also Read – జగన్ వెన్నపూస నొక్కుళ్ళు.?

అయితే ఈ వార్తలను ఏపీ పోలీసులు ఖండించారు. తాము కొడాలి నానిపై లుకవుట్ నోటీస్ జారీ చేయడం వాస్తవమే కానీ అరెస్ట్‌ చేయలేదని స్పష్టం చేశారు. కొడాలి నానిని పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

కొడాలి నాని రెండు నెలల క్రితం ముంబయిలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకొని నెల రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆయన కోసం గుడివాడ ప్రజలతో సహా అందరూ ఎదురుచూస్తున్నారు.

Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!

ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు నోటీస్ కూడా ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనంగా ఉన్నాయి. ఆయన అరెస్ట్‌ వార్తని పోలీసులు ఖండించారు కానీ కేసు విచారణ ఏ దశలో ఉందో చెప్పనే లేదు.




ఇంతకీ కొడాలి నాని హైదరాబాద్‌లోనే ఉన్నారా లేదా మళ్ళీ ముంబయి, బెంగళూరు లేదా కోల్‌కత్తాకు వెళ్ళిపోయారా? ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పకపోయినా ఆయన కోసం ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

Also Read – విదేశీ భాషలు నేర్చుకోవడం గొప్ప కానీ హిందీ కాదా?