kodali_nani chapter Begins

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు కష్టాలు తప్పవని జగన్‌తో సహా వైసీపీ నేతలు ముందే గ్రహించారు. వారు ఆవిదంగా భావించడానికి గల కారణాలు అందరి కంటే వారికే బాగా తెలుసు. వైసీపీ నేతల్లో ప్రతీ ఒక్కరికీ ఎవరి హిస్టరీ వారికి వేరేగా ఉంది. కనుక ఆ ప్రకారం తమకి ఎటువంటి సమస్యలు, ఎప్పుడు ఏ స్థాయిలో ఎదుర్కోవలసి ఉంటుందో ముందే ఊహించగలరు.

రెడ్‌బుక్‌లో అందరి కంటే పైన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరుంటుందని అందరూ భావించారు. కానీ ఆయన పేరు మొదటి అధ్యాయంలో కాక రెండో అధ్యాయంలో ఉండటం ఆశ్చర్యకరమే. కానీ కాస్త ఆలస్యమైన తనకీ ఓ రోజు వస్తుందని కొడాలి నానికి బాగా తెలుసు.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

ఆయన ఊహించిన్నట్లే మచిలీపట్నం పోలీసులు గత ఏడాది జూన్‌లో నమోదు చేసిన కేసుని ఇప్పుడు అటక మీద నుంచి కిందకు దించి ఆయనకు ముహూర్తం పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. వారు ఇంకా ఆ కేసు ఫైల్ తెరిచి చూడక ముందే కొడాలి నాని ముందే జాగ్రత్తపడుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

రాజకీయ కక్షతో నమోదు చేసిన ఆ తప్పుడు కేసుని కొట్టివేయాలని కొడాలి నాని కోరారు. లేకుంటే ఆ కేసులో నమోదు చేసిన సెక్షన్స్ ప్రకారం తాను ఏడేళ్ళు జైలులో గడపాల్సి వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక ఆ కేసులో తనని అరెస్ట్‌ చేయకుండా ముందుగా తన వివరణ తీసుకోవాలని మచిలీపట్నం పోలీసులను ఆదేశించాలని కొడాలి నాని హైకోర్టుని అభ్యర్ధించారు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!


అయితే కొడాలి నానిపై సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన సతీమణి భువనేశ్వరి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేస్తారని అనుకోగా, పోలీసుల పట్ల అవమానకరంగా వారి ఆత్మ స్థైర్యం దెబ్బ తినే విదంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇది కేవలం రెండో అధ్యాయంలో మొదటి కేసు మాత్రమే కనుక రాబోయే రోజుల్లో కేసుల విషయంలో తమ సొంత పార్టీ నేత పోసానితోనే కొడాలి నాని పోటీ పడాల్సివచ్చినా ఆశ్చర్యం లేదు.