Kodali Nani Touch Chesi Chudu Video in Social Media

గుడివాడ లో ఘోర ఓటమికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కి జరిగిన పెను పరాభవం రెండు కలిసి బూతుల నోటికి తాళం వేసింది, అరాచక రాజకీయానికి అడ్డుకట్ట కట్టింది. ఇప్పుడు దానికి తోడు వల్లభనేని వంశీ అరెస్ట్ ఇవన్నీ కలిపి కొడాలి నాని అసలు బండారాన్ని సోషల్ మీడియా ‘టచ్’ చేసింది.

అధికార మదంతో, పదవి ఉంది అనే అహంకారంతో, జగన్ మెప్పు పొందాలి అనే తాపత్రయంతో కన్ను మిన్ను కానక కొడాలి నాని వాగిన అసందర్భ వాగుడు, తిట్టిన బూతులు, టీడీపీ పార్టీని, ఆ పార్టీ యువ నాయకుడు లోకేష్ ను ఉద్దేశించి నాని చేసిన హెచ్చరికలను సోషల్ మీడియా మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది.

Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో భాగంగా అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయిన నాయకులను ఉద్దేశించి రాబోయేది టీడీపీ ప్రభుత్వమే, మేము అధికారంలోకి వచ్చాకా హద్దుదాటి వ్యవహరించిన ప్రతి ఒక్కరికి అడ్డుకట్ట వేస్తాం, గీత దాటి రాజకీయం చేస్తున్న ప్రతిఒక్కరి లెక్క తేలుస్తాం అంటూ టీడీపీ క్యాడర్ కు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కొడాలి నాని, లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ వైసీపీ అధికారిక భాషతో రెచ్చిపోయారు. ఇక పనిలోపనిగా చంద్రబాబు మీద కూడా దిగజారుడు విమర్శలు చేస్తూ మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చేదిలేదు, సచ్చేది లేదు. నీ పిచ్చి బెదిరింపులకు, పిల్ల రాజకీయాలకు ఇక్కడ ఎవరు భయపడరు.

Also Read – కళ్ళు మూసుకుంటానికి హోదా కావాలా.?

దమ్ముంటే టచ్ చేసి చూడడండి. నన్నే కాదు వల్లభనేని వంశీని కానీ, ద్వారంపూడి ని కానీ, పేర్ని నాని ని కానీ, అంబటి రాంబాబు ని కానీ ఇందులో ఏ ఒక్కరినైనా టచ్ చేసి చూడు నా……..అంటూ బూతులతో, బీప్ సౌండ్లతో మనిషిని అనే కనీస సృహ మరిచి ప్రవర్తించిన ఆనాటి కొడాలి నాని వ్యాఖ్యలను ఈనాడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.

ఏ కొడాలి…నువ్వు చెప్పినట్టే టచ్ చేసాం, ఎం పీకుతావో చూద్దాం, నాడు దమ్ముంటే టచ్ చెయ్యరా అంటూ మీడియాలో రంకెలేశావు కదా, ఇప్పుడు వల్లభనేని ని టచ్ చేయడం కాదు ఏకంగా అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు. మరి ఇప్పుడు బయటకు రావడానికి కూడా ఎందుకు భయపడుతున్నావ్, మీడియాను టచ్ చేయడానికి కూడా ఎందుకు వెనుకడుగు వేస్తున్నావ్ అంటూ కొడాలి నాని ని ఒకరకంగా సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తున్నారు.

Also Read – ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!