టీడీపీ నేతలందరికీ జగన్ తర్వాత అత్యంత ప్రియమైన శత్రువులు ఎవరూ అంటే టక్కున గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు చెపుతారు. ఎందుకో అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ, ప్రోత్సాహం చూసుకొని చెలరేగిపోయిన కొడాలి నాని, ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి దాదాపు సైలంట్ అయిపోయారు. జగన్ మాట కాదనలేక అడపాదడపా బయటకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై మొక్కుబడిగా రెండు విమర్శలు విసిరి వెళ్ళిపోతున్నారే తప్ప ఆయన మాటలలో ఇదివరకటి బూతులు, నిప్పులు రెండూ కనిపించడంలేదని టీడీపీ నేతలే అనుకుంటున్నారు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
కానీ ఆయన ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయినంత మాత్రాన్న, నారా లోకేష్ పట్టించుకోనంత మాత్రాన్న క్షమించేసిననట్లు కాదు. కనుక ‘రెడ్ బుక్’లో ఆయన పేరిట ఉన్న అధ్యాయం మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం.
ముందుగా గుడివాడలో ఆయన అనుచరులు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2022, డిసెంబర్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వేంకటేశ్వరరావు ఇంటిపై పెట్రోల్ నింపిన ప్యాకెట్లని విసిరి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
వారు కొడాలి నానికి తెలియకుండా, ఆయన అనుమతి, ఆదేశం లేకుండా ఇటువంటి సాహసాలు చేయరని వేరే చెప్పక్కరలేదు. కనుక వారిని అరెస్ట్ చేయడం అంటే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసిననట్లే.
అదెప్పుడనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ బయటకు వస్తున్నారు కనుక అప్పుడే కొడాలి నానికి కూడా ముహూర్తం పెడతారేమో?