konda-surekha-comments-on-delhi-election-results

పిల్లి, ఎలక కొట్టుకుని నేరం నక్క మీద వేసినట్టు ఢిల్లీ ఎన్నికలలో నువ్వా- నేనా అంటూ రాజకీయ సమరం చేసిన బీజేపీ, ఆప్ లు తమ ఓటమికి కాంగ్రెస్ కారణమంటూ ఆప్ వాదిస్తుంటే, తెలంగాణ మహిళ మంత్రి కొండా సురేఖ ఆప్ అపజయానికి బిఆర్ఎస్ అవినీతే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

బిఆర్ఎస్ పార్టీ అవినీతి కవిత లిక్కర్ స్కాం రూపంలో ఆప్ పార్టీని ముంచేసిందని, బిఆర్ఎస్ ఒక భస్మాసుర హస్తం మాదిరి ఎక్కడికెళ్లినా, ఆ పార్టీ నేతలను ఎవరు నమ్మినా ఇక పార్టీ భూస్థాపితమే అంటూ కవిత లిక్కర్ స్కాం మీద ఆరోపణలు గుప్పిస్తూ ఆప్ ఓటమికి బిఆర్ఎస్ పార్టీకి లింక్ పెట్టారు కొండా సురేఖ.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో కలిసి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లిక్కర్ స్కాం చేయడం, సాక్ష్యాలతో అడ్డంగా దొరకడం ఫలితంగానే కేజ్రీవాల్ కూడా ఓటమిని ఎదురుకున్నారంటూ వ్యాఖ్యానించారు సురేఖ. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు ఇలా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానిస్తూ ఆప్ పార్టీ గెలుపు మా బాధ్యతా అంటూ నిలదీశారు.

ఇక ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అది బీజేపీకి వరంలా ఆప్ కి శాపంలా మారిందంటూ ఆప్ కార్యకర్తలు కాంగ్రెస్ తీరుని తప్పుబడుతున్నారు. అయితే ఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక రాష్ట్రంలో ఒక సీనియర్ జాతీయ రాజకీయ పార్టీగా, కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి ఎలా వెనక్కి తగ్గుతుంది.? అది సాధ్యమయ్యే కార్యమే కాదు అనేది వాస్తవం.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

అయితే ఆప్, కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండి బీజేపీ మీద తిరుగుబావుటా వెయ్యగలగాలి. దానికి ఆప్ నో చెప్పిన సందర్భంగా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి పోరాటం వారు చెయ్యాల్సిందే. ప్రస్తుతం అదే జరిగింది. అయినా పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా కేజ్రీవాల్ మీద పడిన అవినీతి మరకలు ఆప్ ఓటమిని నిర్దేశించాయి.




దానికి తోడు నిర్మలమ్మ నిర్మలమైన మనసుతో ఉద్యోగులకు ఇచ్చిన టాక్స్ బెనిఫిట్స్ బీజేపీ విజయానికి బాటలు వేసి ఉండవచ్చు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు టి. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటుగా బిఆర్ఎస్ అవినీతో, కాంగ్రెస్ ఒంటరి పోరో అనేది ఒక కారణం అయితే కావచ్చు కానీ అదే పూర్తిగా ఫలితాలను ప్రభావితం చేసింది అంటే ఏడవలేక మంగళవారం అన్నటుగా ఉంటుంది.

Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!