
‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి ఛానల్లో చాలా అసభ్యకరకమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఆస్థాన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేసి గుంటూరు జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. కెఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొని ఆ వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు, ప్రజాగ్రహానికి, పోలీసులకు భయపడి విశాఖ పారిపోయి వచ్చి భీమిలిలో ఓ వైసీపీ నేత ఇంట్లో తలదాచుకున్నారు.
ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు సెల్ సిగ్నల్ ఆధారంగా భీమిలి సమీపంలో తగరపువలస వద్ద ఉన్నట్లు గుర్తించి బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. గురువారం ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఈరోజు మద్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పరుస్తారు.
Also Read – మంగళగిరి మొనగాడెవరు.?
హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కానీ అది విచారణకు వచ్చేలోగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
కనుక కృష్ణంరాజుకి కూడా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. విదిస్తే గుంటూరు జైలులోనే ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుతో కలిసి మళ్ళీ లైవ్ షో కంటిన్యూ చేసుకోవచ్చు. ఆలోగా వాతావరణం బాగుంటే జగన్ వీలుచూసుకొని వచ్చి పరామర్శించి వెళతారు.