గత 5 ఏళ్ళుగా ఏపీని పాలించిన జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పల్రాజు వంటివారు మీడియా, ప్రజల ముందు ఉన్నామనే స్పృహళేన్నట్లు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు.
తాము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆ రెండు పార్టీల నేతలనీ ‘ఫుట్ బాల్’ ఆడేసుకుంటున్నామనే అనుకున్నారు తప్ప తమ నోటి తీటని చూసి ప్రజలు తమని అసహ్యించుకుంటున్నారని గ్రహించలేకపోయారు. తత్ఫలితంగా ప్రజలు వారికి గడ్డిపెట్టిన్నట్లు కేవలం 11 సీట్లతో మూలకూర్చోబెట్టారు.
Also Read – ప్యాలస్‌లో ప్రతిపక్షం… సోషల్ మీడియాలో రాజకీయాలు!
తెలంగాణలో మాకు తిరుగెలేదని రెచ్చిపోయిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికారంలో ఉన్నప్పుడు నోటితో చెలరేగిపోయారు.
కేసీఆర్ నోటికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, రాష్ట్ర గవర్నర్ తమిళసై, ఎప్పుడో చనిపోయిన ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పుడు ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్… ఇలా ఎంతటివారైనా ఆయనకు అలుసే.
Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్ డౌట్!
నోటికి ఎంతోస్తే అంతా అనేస్తూ మళ్ళీ ‘ఏం నేనేమైనా తప్పుగా అన్నానా?’ అని కేసీఆర్ ప్రశ్నిస్తుండేవారు. ఆయన కుమారుడు కేటీఆర్ కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకే తెలంగాణ ప్రజలు కూడా వారిని ఓడించి మూల కూర్చోపెట్టారు.
ఈ రెండు పార్టీల నేతలు అధికారం కోల్పోవడానికి తమ నోటి దురద కూడా ఒక కారణమని నేటికీ గ్రహించకుండా ఇంకా నోటి దురుసుతనం ప్రదర్శిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.
Also Read – ఏపీకి, టిడిపికి వైసీపి చాలా అవసరమే!
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం కోసం సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి కూటమి ప్రభుత్వం రేయింబవళ్ళు కష్టపడుతుంటే దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు, జాతీయ మీడియా కూడా అది చూసి మెచ్చుకుంది. కానీ వైసీపి అధినేత జగన్ ఏవిదంగా మాట్లాడారో అందరూ విన్నారు. అటువంటి కష్ట సమయంలో కూడా నీచ రాజకీయాలు చేయడం, నోటికి వచ్చిన్నట్లు జగన్ మాట్లాడటాన్ని ప్రజలు కూడా అసహ్యించుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌హౌస్ గడప దాటి బయటకు రావడం లేదు కనుక కేటీఆర్ చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘పనికిమాలినోడు… తల మాసినోడు…” అంటూ చాలా అనుచితంగా మాట్లాడారు. అక్కడితో ఆపకుండా “ఇలాంటి ముఖ్యమంత్రులని చాలా మందిని మేము చూశాము…” అంటూ వైఎస్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యల పేర్లు చెప్పారు. అంటే వారందరూ కూడా పనికి మాలిన ముఖ్యమంత్రులే అని కేటీఆర్ అభిప్రాయపడుతున్నట్లు అర్దమవుతోంది.
ఇప్పటికే ‘బ్రతకడానికి వచ్చినోళ్ళు’ అంటూ ఆంధ్రావాళ్ళ గురించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు జారితే, ఇప్పుడు కేటీఆర్ ఈవిదంగా మాట్లాడి తన అహంభావాన్ని, వారి పట్ల తన ఏహ్యతని ప్రదర్శించి పార్టీకి ఇంకా నష్టం కలిగించుకున్నారనే చెప్పాలి.
త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇంత అనుభవం ఉన్న కేటీఆర్‌కి ఇలా నోటి దురద ప్రదర్శితే త్వరలో జరుగబోయే ఆ ఎన్నికలలో మరోసారి ‘రిటర్న్ గిఫ్ట్’ అందుకోవలసి వస్తుందనే జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.