KTR Dharna Arrest At Gunpark

ఈరోజు ఉదయం తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలో వారం రోజులు పర్యటనకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు వారు బయలుదేరారు.

Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!

ఈరోజు ఉదయమే కేటీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో గన్‌పార్క్ వద్ద ధర్నా చేసినందుకు పోలీసులు కేటీఆర్‌, హరీష్ రావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఒకప్పుడు ఓటుకి నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని కేసీఆర్‌ జైలుకి పంపించారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో విమానంలో అమెరికా వెళుతుండగా, అదే సమయంలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్ రావులని అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులో పోలీస్ స్టేషన్‌ తరలిస్తున్నారు. ఓడలు బళ్ళు అవుతాయంటే ఇదేనేమో?

Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతానని, మళ్ళీ తాను ముఖ్యమంత్రినవుతారని కేటీఆర్‌, హరీష్ రావుల చేత కేసీఆర్‌అసందర్భ ప్రేలాపనలు చేయించినందుకు, ఇప్పుడు ఆయన పార్టీ ప్రమాదంలో ఉన్నా గడప దాటి బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చి ఉండి ఉంటే కేటీఆర్‌, హరీష్ రావులతో పాటు ఆయన కూడా అరెస్ట్ అయ్యేవారే!

బహుశః అందుకు ఇష్టపడకనో లేదా అహం అడ్డువచ్చినందునో లేదా కొడుకుని ఈవిదంగా ప్రమోట్ చేయాలనో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో, కేటీఆర్‌ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి విమానంలో ఉండటం యాదృచ్చికమే కావచ్చు. కానీ విధిలీల అంటే ఇదేనేమోననిపించక మానదు.

Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?


image.png