
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఈ నెల 22న చెన్నైలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు.
దీనిలో పాల్గొనవలసిందిగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నారు. ఆయన తరపున డీఎంకే పార్టీ ముఖ్య నేతలు గురువారం హైదరాబాద్ వచ్చి ముందు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని, తర్వాత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి ఈ సమావేశానికి రావలసిందిగా ఆహ్వానించారు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినప్పటికీ తమ పార్టీ అధిష్టానం అనుమతిస్తే తప్పక వస్తానని చెప్పారు. డీఎంకే నేతలతో సమావేశమైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రతిపాదన వలన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు అదే విదంగా…. ఆంధ్రాకు నష్టం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించినప్పుడు తెలంగాణ, తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలు దానిని అమలుచేసి జనాభా నియంత్రణ చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకోవడం సరికాదు.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
ఈ అంశంపై డీఎంకేతో కలిసి పోరాడాలని కేసీఆర్‌గారి సూచన మేరకు మేము తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొంటాము,” అని కేటీఆర్ చెప్పారు.
దశాబ్ధాలుగా ఓకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పట్ల నేటికీ బిఆర్ఎస్ నేతలకు ద్వేషభావమే తప్ప ఎటువంటి అభిమానం, గౌరవం లేదని వారి మాటలు, చేతలతో పదేపదే నిరూపించి చూపుతూనే ఉన్నారు.
ఈ సమస్యపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెపుతున్న కేటీఆర్, ఆంధ్రా పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదని ఆయన మాటలు వింటే అర్దమవుతుంది.
బిఆర్ఎస్ నేతలకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంత ద్వేషం ఉన్నప్పుడు, ఈ సమస్యపై కలిసికట్టుగా పోరాడాలని ఎలా అనుకుంటున్నారు? ఆంధ్ర అనే పదం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కూటమి ప్రభుత్వంలో పార్టీలు బిఆర్ఎస్ నేతలకు నచ్చదు సరే!
తెలంగాణలో తమని గద్దె దించినందుకు నిత్యం సిఎం రేవంత్ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు కదా?ఒకవేళ ఈ సమావేశానికి ఆయన కూడా వస్తే కలిసి ఆయనతో చేతులు కలిపి పోరాడుతారా?లేదా కాంగ్రెస్ వస్తే మేము రామని చెప్పి తప్పించుకుంటారా?
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాన మంత్రి అవ్వాలనే కోరికతో టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. కానీ నేటికీ ఆయనతో సహా ఆ పార్టీ నేతలలో ప్రాంతీయవాదమే తప్ప జాతీయ స్పూర్తి కనిపించదు. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రా పేరు పాలకడానికి కేటీఆర్ ఇష్టపడకపోవడమే ఇందుకు తాజా నిదర్శనం.. కాదా?