
ఆనాడు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ ‘విగ్నాధిపతి’ పదవి కోసం పోటీ పడినప్పుడు కుమారస్వామి నెమలి వాహనంపై రయ్యిన మూడు లోకాలు చుట్టేసినా, చివరికి శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసిన వినాయకుడికే ఆ పదవి దక్కింది. ఈ కధ అందరికీ తెలిసిందే.
కానీ కర్ణాటకలోని జనతాదళ్ పార్టీకి చెందిన కుమారస్వామి విషయంలో మాత్రం ఈ కధ రివర్స్ అయ్యింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఆర్ధికంగా సాయం చేయడమే కాకుండా, తానే స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెడతానని మాజీ సిఎం కేసీఆర్ భరోసా ఇవ్వడంతో కుమారస్వామి కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్ పార్టీగా మార్చుతున్నప్పుడు కుమారస్వామి ఆయన వెనకే నిలబడి చప్పట్లు కొట్టారు.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
కానీ కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో కదలికలు వస్తాయనే సూచనతోనే ఆయన వెనక్కు తగ్గారని ఊహాగానాలు వినిపించాయి. కేసీఆర్ ఏ కారణంతో వెనక్కు తగ్గినప్పటికీ ఆయననే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగిన కుమారస్వామి దెబ్బైపోయారు… అని ఆయనే స్వయంగా చెప్పుకొని బాధపడ్డారు కూడా!
తాను ప్రదక్షిణాలు చేయాల్సింది కేసీఆర్ చుట్టూ కాదని కుమారస్వామి గ్రహించిన తర్వాత, సరైన వ్యక్తిని గుర్తించి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయడంతో వెంటనే ‘పుణ్య ఫలం’ కూడా దక్కింది.
Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?
భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న ఆయన చుట్టూనే ఏపీ, తెలంగాణలతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆయన ద్వారానే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించి రూ.11,500 కోట్లు విడుదల కాబోతోంది.
జగన్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన వారిలో కూడా బొక్కినవారు బొక్కగా, మిగిలినవారు ఇలాగే బలైపోతున్నారు. కనుక రాజకీయాలలో సరైన వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తిత్వ కలిసి ముందుకు సాగడం చాలా ముఖ్యమని ఈ కుమారస్వామి, జగన్మోహన చరిత్రలు చదివినవారికి అర్దమవుతుంది.