
గత కొంతకాలంగా మంచు వారి ఇంట ఫ్యామిలీ వార్ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆస్తి తగాదాలే కారణమంటూ ఒకరు, ఆస్తి కాదు ఆత్మగౌరవ పోరాటం అంటూ మరొకరు మీడియాకెక్కి మరి మంచు ఫ్యామిలీ పరువును బజారున పెట్టుకున్నారు.
ఇక ఈ అన్నదమ్ముల ఆధిపత్య వార్ కు బ్రేకులు వేయాల్సిన తండ్రి మంచు మోహన్ బాబు విష్ణు కి మద్దతుగా, మనోజ్ పై ఆరోపణలు చేస్తూ మీడియా వారి పై దాడి కూడా చేసారు. ఇలా మంచు వారి ఇంట ఇన్నాళ్లు బహిరంగంగా సాగిన ఈ ఫ్యామిలీ వార్ ఇప్పుడు థియేటర్లకు పాకనుంది అనేలా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్లకు పైబడి, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, శివన్న వంటి భారీ తారాగణంతో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప మూవీ ని ఏప్రిల్ 25 న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు విష్ణు సిద్ధంగా ఉన్నారు.
అందుకు సంబంధించి ఇప్పటికే కన్నప్ప మూవీ ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు విష్ణు. అయితే ఈ మూవీలో విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు కి బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయి మార్కెట్ లేకపోయినా అంతా శివేధ్యే అంటూ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు విష్ణు.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
అలాగే గత కొన్నేళ్ల నుంచి మంచు వారి ఫ్యామిలీ సినిమాలకు ప్రేక్షకులలో అంత ఆదరణ కనిపించకపోయినా విష్ణు కన్నప్ప తగ్గేదెలా అంటూ ఏప్రిల్ 25 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత సమస్యలతో గత కొంతకాలంగా వెండి తెరకు, కెమెరాకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇప్పుడు భైరవం మూవీ తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అయితే ఈ ఇద్దరు మంచు బ్రదర్స్ చాల కాలం గ్యాప్ తరువాత కన్నప్ప అంటూ భారీ బడ్జెట్ తో ఒకరు, భైరవం అంటూ చిన్న సినిమాగా మరొకరు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అయితే మనోజ్ భైరవం గురించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోయినప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ ఒక్క రూమర్ తో భైరవం మూవీ అందరి దృష్టిలో పడింది.
Also Read – పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
అన్న కన్నప్ప కు పోటీగా అదే రోజు ఏప్రిల్ 25 న తానూ భైరవం అంటూ బరిలో దిగాలని మనోజ్ ప్లాన్ చేస్తున్నట్టు సినీవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో మంచు వారి ఫ్యామిలీ వార్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందా.? లేక ఇవన్నీ భైరవం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రూమర్స్ మాదిరే మిగిలిపోతాయా అనేది చూడాలి.