తండ్రి కొడుకుల మధ్య దాడి, ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో పరస్పర కేసులు నమోదు చేసుకున్నారు అంటూ మీడియాలో వచ్చిన కథనాల మీద మంచు మోహన్ బాబు టీం స్పందించి అబ్బే ఇదంతా ఒట్టి పుకార్లే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ ప్రకటన రూపంలో వెల్లడించారు.

అయినా ఇవన్నీ నమ్మదగ్గ నిజాలు కావనేలా ప్రస్తుత పరిస్థితులు కనపడుతున్నాయి. మంచు ఫామిలీ లో మొదలైన ఆస్తి పంపకాల వివాదం చిలికి చిలికి భౌతిక దాడిగా మారిందా.? అనే ప్రశ్నకు మనోజ్ బదులివ్వాల్సి ఉంటుంది. అయితే నిన్న గాయాలతో ఆసుపత్రికి చేరిన మనోజ్ మరి కొద్దీ సేపటికే డిశ్చార్జ్ అయ్యారు.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

అయితే ఆయన ఒంటి మీద బలమైన గాయాలు ఉన్నట్లు, ఆయన కాలు, మెడ భాగంలో వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మీడియాలో వార్త కథనాలు ప్రచారం అయ్యాయి. మరి ఆ వార్తలలో వీటిలో వాస్తవమెంత, అసలు ఆయనకు అంత తీవ్రంగా గాయాలు తగలడానికి కారణాలేమిటి అనేది మనోజ్ నోరు విప్పితే కానీ బయటకు రాదు.

అయితే మనోజ్ నోరు విప్పి వాస్తవాలు బయట పెట్టి ప్రజలలో ఏర్పడిన ఈ అనుమానాలను, అపోహలను ‘మంచు’ లా కరిగిస్తారా.? లేక కుటుంబ వివాదాలను గుట్టుగా దాచి మంచు కుటుంబ పరువును కాపాడుకుంటారా.? అసలు ఈ కుటుంబంలో ఈ వివాదం చెలరేగకపోతే మనోజ్ కు గాయమైతే మోహన్ బాబు మౌనంగా ఎందుకున్నారు.? మంచు కుటుంబం నుంచి కనీస స్పందన ఎందుకు కరువయ్యింది.?

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

అటు లక్ష్మి కానీ, ఇటు విష్ణు కానీ మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ కు అండగా ఏ ఒక్కరు అడుగు ముందుకు వేసి ఆసుపత్రికి ఎందుకు రాలేదు.? మనోజ్ కు తోడుగా ఎందుకు నిలబడలేదు. గతంలో కూడా మంచు విష్ణు, మనోజ్ మధ్య ఈ తరహా వివాదమే సోషల్ మనోజ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి, అదృశ్యమయ్యింది.

గత కొద్దికాలంగా అన్నాతమ్ముళ్ల మధ్య మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పుడు తండ్రి కొడుకుల వరకు పాకింది అనేది బయట ప్రచారం జరుగుతుంది. అలాగే తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ పేరుతో మోహన్ బాబు, విష్ణు నడుపుతున్న స్కూల్ విషయమే ఈ వివాదానికి కారణం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!


క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ కట్టు దిట్టంగా ఉండే మంచు ఫ్యామిలీ లో ఏర్పడిన ఈ వివాదం ‘మంచు’లా కరిగిపోతుందా.? లేక ‘మంటలు’ రేపుతుందా.?