
పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతాయనే గ్యారెంటీ ఏమీ లేదని మళ్ళీ మళ్ళీ నిరూపించబడుతూనే ఉంది. కనుక మంచు విష్ణు సుమారు 200 కోట్లు ఖర్చు చేసి తానే హీరో (కన్నప్ప)గా 5 భాషల్లో పాన్ ఇండియా మూవీ తీయడం చాలా సాహసోపేతమే అని చెప్పొచ్చు.
మిర్చి9 తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయం అడిగితే, “తనికెళ్ళ భరణిగారు నాకు ఈ కధ ఇచ్చారు. దాంతో 4-5 కోట్లతో చక్కటి సినిమా తీసి ఇవ్వగలనని చెప్పారు. కానీ ఈ కధతో ఇంకా గొప్పగా తీయవచ్చనే నమ్మకం నాకు కలగడంతో సినిమా మొదలుపెడితే భారీ బడ్జెట్ పిక్చర్‌గా మారిపోయింది తప్ప భారీ బడ్జెట్‌తో తీయాలనే ఉద్దేశ్యంతో అంత సొమ్ము ఖర్చు చేయలేదు,” అని మంచు విష్ణు చెప్పారు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
ఈ సినిమాలో అనేకమంది సీనియర్ నటులను తీసుకోవడం గురించి అడిగిన ప్రశ్నకు, “ఈ కధకి అవసరమనిపించినందునే ఇంతమందిని తీసుకున్నాము తప్ప వారిని చూపించి సినిమా ఆడించుకోవాలని కాదు. వారిలో చాలా మంది మానాన్నగారిపై గౌరవంతోనే ఒప్పుకున్నారు.
ప్రభాస్, మోహన్ లాల్‌గారు పారితోషికం ఇస్తామన్నా తీసుకోకుండా ఉచితంగా చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్‌కి తగిన పాత్ర లేదు కనుకనే తీసుకోలేదు,” అని మంచు విష్ణు చెప్పారు.
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
“ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక ఇదే నా మొదటి సినిమా అన్నంతగా కష్టపడి పనిచేస్తున్నాను. ఇంతమంది పెద్ద హీరోలతో నేను ఈ సినిమా తీయగలగడం కేవలం శివలీలే అని భావిస్తున్నాను. ఈ శివలీల వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను.
నేను భారీ బడ్జెట్ పెట్టి ఇంతమంది అగ్ర నటులతో ఈ సినిమా తీసినప్పటికీ ఆ పరమేశ్వరుడి దయ ఉంటేనే కన్నప్ప సూపర్ హిట్ అవుతుంది. లేకుంటే లేదు,” అని స్పష్టం చేశారు మంచు విష్ణు.
Also Read – ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?
మంచు కుటుంబం సినిమాలపై ఇండస్ట్రీలో కొందరు నేటికీ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, ఇటీవల విడుదలైన కన్నప్పలో రెండో పాటపై ఇతర భాషలలో మంచి ఆధరణ లాభిస్తుంటే తెలుగులో మాత్రం విమర్శలు వినిపిస్తుందటమే ఇందుకు నిదర్శనమని మంచు విష్ణు అన్నారు.
కానీ ఆ శివుడి దయతో ఇటువంటి అవరోధాలన్నిటినీ ఎదుర్కొని కన్నప్ప విజయం సాధిస్తుందని మంచు విష్ణు నమ్మకంగా చెప్పారు.
తనకు, తన తండ్రికి రెండు తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడులో కూడా దాదాపు అన్ని పార్టీలతో, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో మంచి పరిచయాలున్నాయని చెప్పారు. కానీ రాజకీయాలకు తాను ఎప్పటికీ దూరంగా ఉంటానని మంచు విష్ణు చెప్పారు.
తాను నటించాల్సినవి, నిర్మించాల్సినవి కలిపి మరో 10-15 సినిమాలు సిద్దంగా ఉన్నాయని, కానీ కన్నప్ప పూర్తయ్యి థియేటర్లలో విడుదలయ్యే వరకు మరో సినిమా గురించి ఆలోచించనని మంచు విష్ణు అన్నారు.
మంచు విష్ణు చాలా నమ్మకంతోనే భారీ బడ్జెట్‌తో కన్నప్ప సినిమా తీస్తున్నప్పటికీ, ఇంటా బయటా చల్ఆ మంది శత్రువులున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు చేసిన ఎవ్వర్ గ్రీన్ సినిమా ‘భక్త కన్నప్ప’తో తెలుగు ప్రేక్షకులు తప్పకుండా పోల్చి చూస్తారు.
కనుక ‘ఆదిపురుష్’లాగా ఏమైనా తప్పుడు ప్రయోగాలు చేస్తే బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే మంచు విష్ణుకి బహుశః ఇదే చివరి సినిమా కావచ్చు. కానీ ఈ సినిమా హిట్ అయితే మంచు కుటుంబం ప్రతిష్ట పెరుగుతుంది.
మంచు విష్ణు సినీ ప్రస్థానంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది. మంచు విష్ణు శివుడిని నమ్ముకొని కన్నప్ప తీశారు కనుక ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని ఆశిద్దాం.