సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాని కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కృషి ఫలించిన్నట్లయింది. కనుక అందరూ ఆయనను అభినందించారు.
Also Read – అయ్యో పాపం… వాలంటీర్లు!
కానీ దీనిని సాధించిన మందకృష్ణ మాదిగ స్వయంగా ఇప్పుడు మరో కొత్త సమస్యని సృష్టిస్తున్నారు. “ప్రభుత్వ రంగంలో నానాటికీ ఉద్యోగాల సంక్య తగ్గిపోతుంటే మరోవైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయని, కనుక ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు మరో కొత్త పోరాటం ప్రారంభిస్తానని” అన్నారు. ఇది అందరికీ సమస్యగా మారే ప్రమాదం ఉంది.
ఇక రాజకీయ కోణంలో నుంచి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిని అమలుచేశారు. అప్పుడు రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉండేది. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ మాలమహానాడు న్యాయపోరాటాలు చేసి నిలిపివేయించింది.
Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?
మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్ష కుమార్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు (మాలలకు) ఆమోదయోగ్యం కాదన్నారు.
షెడ్యూల్డ్ కులాలకు సంబందించిన ఆర్టికల్ 351 ప్రకారం వర్గీకరణ చేసే హక్కు పార్లమెంటుకి కూడా లేదని, మరి సుప్రీంకోర్టు ఏవిదంగా వర్గీకరణపై తీర్పు చెప్పిందని హర్ష కుమార్ ప్రశ్నించారు. అవసరమైతే పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!
ఇదీగాక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇప్పుడు మాదిగల కంటే మాలల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉన్నత విద్యా, ఉద్యోగాలలో వారే ముందున్నారు. ఎస్సీ వర్గీకరణ జరుగకపోవడం వలన ఎక్కువ ప్రయోజనం వారే పొందుతున్నారు.
కనుక చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణని స్వాగతించినప్పటికీ దానిని అమలుచేయడానికి ప్రయత్నిస్తే మాలలకు ఆగ్రహం కలుగుతుంది. అమలుచేస్తే ఉద్యమాలకు వెనకాడబోమని హర్షకుమార్ ముందే హెచ్చరించారు. కనుక అమలుచేయలేరు. కానీ చేయకపోతే మందకృష్ణ మాదిగ మళ్ళీ పోరాటాలు ప్రారంభించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఖాయం.
కనుక కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు టిడిపి కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరో ఒకరికి ఆగ్రహం కలుగక మానదు. ఈ సమస్యని సిఎం చంద్రబాబు నాయుడు ఏవిదంగా పరిష్కరిస్తారో?