మోస్ట్ ఏవేటెడ్ పాన్ ఇండియా మూవీ గా సూపర్ క్రెజ్ దక్కించుకున్న పుష్ప -2 మూవీ గురించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా పుష్ప -2 సినిమా లో ఐటెం సాంగ్ విషయంలో రూమర్లు ఏమాత్రం తగ్గడం లేదు.
పుష్ప లో అల్లు అర్జున్, సమంత నటించిన ఊ అంటావా మామ పాట ప్రేక్షకులను థియేటర్లలో చిందులు వేసేలా చేసింది. ఈ సాంగ్ సినిమా విడుదలకు ముందే మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది. పుష్ప సినిమాలో అన్ని పాటలు హిట్ అయినప్పటికీ ‘ఊ అంటావా ఉహు అంటావా’ పాట మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టుగా నిలిచింది.
Also Read – జగన్ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!
దీనితో పుష్ప -2 లో వచ్చే ఆ స్పెషల్ సాంగ్ మీద ఆ పాటలో నటించే నటీమణి మీద రోజుకో పుకారు షికారు చేస్తుంది. ముందుగా ఈ పాటలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ నటించబోతున్నారని వార్తలు చక్కర్లు కొడితే కాదు కాదు ఈ పాటలో కూడా సమంతే మ్యాజిక్ చేయనున్నారు అంటు కొంత ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ స్థానంలోకి ప్రస్తుత టాలీవుడ్ క్రెజీ హీరోహిన్ శ్రీలీల కనిపించబోతున్నట్టు సమాచారం బయటకొచ్చింది. బన్నీకి డాన్స్ లో మంచి పోటీ ఇచ్చే నటి దొరికింది అంటు బన్నీ ఫాన్స్ వీరిద్దరి కాంబో కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఇక ఇక్కడితో ఈ ఐటెం సాంగ్ పుకార్లకు శుభం కార్డు పడినట్లే అనుకున్న సందర్భంలో ఈ పాటలో శ్రీలీల తో పాటుగా సమంత కూడా మెరవబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
Also Read – ప్రభుత్వాలు చేతులు కట్టేసుకునే పరిస్థితి దాపురించిందా?
అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే కానీ ఈ వార్తలలో ఎటువంటి వాస్తవం లేదని మరికొన్ని వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప రాజ్ సరసన శ్రీలీల తో పాటుగా మరో బాలీవుడ్ హీరోహిన్ నటించబోతున్నారంటూ కొత్త పుకారు పురుడు పోసుకుంది. అయితే ఆ నటి పేరు మాత్రం బయటకు రాకపోవడం ఆశ్చర్యం.
అలాగే పుష్ప – 2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం సంగీత దర్శకుడు థమన్ పుష్ప టీంలో జాయిన్ అయినట్లు, ఈ మూవీ లో దేవి శ్రీ ప్రసాద్ తో పాటుగా మరికొంతమంది సంగీత దర్శకులు పని చేయబోతున్నట్లు ఇలా రోజుకో వార్త తగ్గేదెలా అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. వచ్చే నెల డిసెంబర్ 5 న థియేటర్లలో పుష్ప రాజ్ వేట మొదలవనుంది. అప్పటి వరకు ఇలా వస్తున్న ఎదో వార్త మూవీ ప్రమోషన్లకు ఉపయోగపడుతూనే ఉంటుంది.