
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిస్ వరల్డ్ పోటీలను’ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలతో తీర్చి దిద్దుతుంది. పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన అందగత్తెలందరికి తెలంగాణ విందు, వినోదాలను కూడా పరిచయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇందులో భాగంగా నిన్న హైద్రాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబసమేతంగా ఈ మిస్ వరల్డ్ పోటీ దారులకు విందును అందించారు. అలాగే నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్దవనాన్ని కూడా సందర్శించి వచ్చారు ప్రపంచ సుందరీమణులు. అలాగే హైదరాబాద్ ఛార్మినార్ లో సైతం తెలంగాణ సాంస్కృతిక కళలకు చెందిన వివిధ వస్తువులను షాపింగ్ చేసారు.
Also Read – రేపు రెంటపాలకు జగన్.. ఏం ప్లాన్ చేశారో?
ఇక నేడు హన్మకొండ లో పర్యటించిన కంటిస్టెంట్స్ రామప్ప దేవాలయం, ప్రసిద్ధి చెందిన వరంగల్ వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట ను సందర్శించారు. దానితో పాటుగా హన్మకొండలోని ఓ హోటల్ లో అధికారులతో కలిసి సుందరీమణులంతా తెలంగాణ బ్రాండ్ గా చెప్పుకునే బతుకమ్మ ఆట ను కూడా ఆడి సందడి చేసారు.
అయితే వీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ తెలంగాణ ప్రజలను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రత్యర్థులకు ఎటువంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
Also Read – కుప్పం ఘటన: వైసీపీ మొదలుపెట్టేసిందిగా!
మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో విజయంవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ను దేశ విదేశాలకు చాటిచెప్పాలనుకుంటున్న రేవంత్ ప్రయత్నం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలానే కనిపిస్తుంది.