Mr Bachchan Double Ismart

కల్కి మానియా తరువాత వస్తున్న క్రెజీ ప్రాజెక్టులలో పూరి డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఈ నెల 15 న థియేటర్ల ముందుకు రానున్నాయి. ధమాకా తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద తడపడుతున్న రవితేజ మళ్ళీ మిస్టర్ బచ్చన్ తో ఫామ్ లోకి రావాలని ఆశపడుతున్నారు.

అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందించిన క్రెజీ దర్శకుడు పూరి జగన్నాధ్ తన స్థాయికి తగ్గ విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేనితో కలిసి మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న పూరి ఆ విజయాన్ని డబుల్ చేసుకోవడానికి ఇస్మార్ట్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ అదే ఆగస్ట్ 15 న తన అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!

తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడితోనే రవితేజ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. అలాగే రామ్ పోతినేనితో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్న హరీష్ ఇప్పుడు అదే హీరోకి పోటీగా తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించి విజయాన్ని అందుకుంటే అది టాలీవుడ్ ఇండస్ట్రీ విజయమే అవుతుంది.

హరీష్ శంకర్ ఇప్పటికే తన సినిమా ప్రమోషన్ మొదలుపెట్టిన నేపథ్యంలో పూరి ఇందులో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. అయితే ఎప్పుడొచ్చాం అని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నంతగా పూరి ప్రేక్షకులలోకి దూసుకెళ్లగలరు. కాంట్రావెర్సీ ఇంటర్ వ్యూ లతో, వైరల్ వీడియోలతో హరీష్ ఒకడుగు ముందుకేస్తూ మిస్టర్ బచ్చన్ పై కంటే తన మీదే ఫోకస్ పెంచుకుంటున్నారు.

Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?


ఈ ఆగస్ట్ 15 న ప్రేక్షకులు ఎవరి సినిమాకు చాక్లెట్ ఇచ్చి నిర్మాతలకు స్వీట్ తినిపిస్తారో, ఎవరి సినిమాను బిస్కేట్ చేసి నిర్మాతకు హాట్ పెడతారో చూడాలి. అయితే ఈ రెండు సినిమాలో ఇప్పటికి ఏ ఒక్కదాని మీద కూడ ఇంకా ఊహించిన స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి.