Mumbai Indians Chennai Super Kings

2008 లో లాంఛనంగా మొదలయిన ఐపీఎల్, ఈ ఎడాదితో 17 ఎడిషన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ 17 ఏళ్లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ ఏది అని అడగగా, ఎవరైనా బదులిచ్చే సమాధానం ‘ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్’. రెండు జట్టులు చెరో 5 ట్రోఫీలు అందుకుని ఐపీఎల్ దిగ్గజాలుగా నిలిచాయి.

అయితే, గడిచిన 5 ఏళ్లలో సీన్ కాస్త రివర్స్ అయినట్టే కనపడుతుంది. గడిచిన ఐదు ఏళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు ట్రోఫీలు గెలుచుకున్నప్పటికీ, మిగతా మూడు సార్లు ప్లే-ఆఫ్స్ వెళ్లేందుకు కూడా అర్హత సాధించలేదు. ఇక, ముంబై టీం విషయానికి వస్తే ఎప్పుడో 2020 లో కప్ అందుకుని, మిగతా 4 సీజన్లలో ఒక్కసారే ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించగలిగింది.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

చెన్నై జట్టు 2 కప్లు అందుకున్నప్పటికీ, ఆ నిలకడతనం చూపించటం లో ఓ మోస్తారు గా విఫలమయ్యారు. మరి ముంబై జట్టు అయితే వరుసనే 2013 – 2020 , 8 సంవత్సరాల వ్యవధిలో ఐదు కప్లు అందుకుని భీకరమైన ఫామ్ లో ఉండగా, మరి ఈ ఐదు ఏళ్ళు ఆ ఫామ్ కోల్పోయారు అని స్పష్టంగా తెలుస్తుంది.

మరి ఇంకో పక్క, రాజస్థాన్ జట్టు అప్పుడేప్పుడో ఐపీఎల్ ఆరంభం లో 2008 లో ఒక ట్రోఫీని అందుకోగా, ఆ తరువాత ఆ రేంజ్ ఆటతీరు చూపించలేకపోయింది. అయితే, గత కొన్ని ఏళ్ళ నుండి వీరు నిలకడగా పెర్ఫామ్ చేస్తున్నారు. 2023 లో ఆరంభం అదిరినప్పటికీ, ఆ ఫామ్ ను కొనసాగించలేక ప్లే-ఆఫ్స్ నుండి వైదొలిగారు.

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!


అయితే 2022 లో ఫైనల్ కు అర్హత సాధించగా, 2024 లో సెమి-ఫైనల్ 2 వరుకు వెళ్లగలిగారు. అయితే మరి ఈ సారి ఆక్షన్ లో అన్ని జట్లు అద్భుతమైన ఆటగాళ్లను వారి జట్లలో ఎంపిక చేసుకోగా, ప్రతి జట్టు అద్భుతమైన ప్లేయింగ్-11 ను సొంతం చేసుకున్నారు. చూడాలి మరి ముంబై, చెన్నై జట్లు ఈసారి కూడా ఐపీఎల్ హాట్ ఫేవటేట్స్ కానున్నాయా?