Allu and Mega Family Disputes

అల్లు వారి ఇంట మెగా వివాదాలు సీరియల్ మాదిరి కొనసాగుతూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. మొన్న తండేల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు ని ఉద్దేశించి గేమ్ ఛేంజర్ మీద అల్లు అరవింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

దీనికి తోడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత యావరేజ్ మూవీ అయినా మగధీర తో బ్లాక్ బస్టర్ కొట్టమంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి పునాది వేసాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదం చిలికి చిలికి అల్లు అరవింద్ ముందుకెళ్లి ఆగాయి.

Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?

అయితే తండేల్ సక్సెస్ మీద మీడియా ముందుకొచ్చిన అల్లు అరవింద్ ఈ వివాదం పై నో కామెంట్స్ అంటూ స్పందించారు. రామ్ చరణ్ చిరుత మూవీ యావరేజ్ అంటూ మీరు చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీ వరకు వచ్చిందా.?

ఇదంతా ,మీ తడబాటా..? పొరపాటా.? లేక అసలు విషయమే బయటకు చెప్పారా .? దీని పై మీ కామెంట్.? అంటూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు, ఆ చాల బాగా గమనించాను… నో కామెంట్స్ అంటూ అల్లు అరవింద్ ఇచ్చిన సమాధానం మరో వివాదానికి తెర లేపినట్లయింది.

Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!


దీనితో ఇప్పట్లో ఈ అల్లు…మెగా వివాదం సద్దుమణిగేదెలే అనేది స్పష్టమయింది. అయితే మొన్నటి వరకు అల్లు అర్జున్ వ్యాఖ్యల మీద మండిపడే మెగా అభిమానులు ఇప్పుడు అల్లు అరవింద్ వ్యాఖ్యల మీద రెచ్చిపోతున్నారు. ‘చెప్పను బ్రదర్’ అనే అల్లు అర్జున్ కామెంట్ తో అంటుకున్న ఈ నిప్పు రవ్వ ఇప్పుడు అరవింద్ ‘నో కామెంట్స్’ వరకు కొనసాగుతూ వస్తుంది. మరి ఈ వివాదానికి ఎండ్ కార్డు పడే రోజెప్పుడు.? సందర్భం ఏది.?