కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటపడి విచారణ ప్రారంభమైనప్పుడు, బియ్యం దొంగలు గప్‌చిప్ అయిపోయారు. వైసీపీలో ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు కానీ, మిగిలిన నేతలు గానీ బియ్యం అక్రమ రవాణా గురించి మాట్లాడటం లేదు.
కానీ అంత మాత్రాన్న వందల కోట్ల టర్నోవర్ జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని వదిలేసుకుంటారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఉంటారా?అనే సందేహం కలగకమానదు.
Also Read – వివేకానంద గురించి జగన్ ట్వీట్
మరి ఈ గుట్టు రట్టు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి మాత్రం కలగదా? అందుకే ఆయన సోమవారం రహస్యంగా వైజాగ్ పోర్టు చేరుకొని పోర్టులో ఆకస్మిక తనికీలు చేశారు. అక్కడ కూడా కంటెయినర్లలో విదేశాలకు రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన వేల టన్నుల బియ్యం కనబడింది.
కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా ఓడలో ఎగుమతి అవుతున్న బియ్యం మూటల వంటివి వాటిలో కొన్ని కనబడ్డాయి. కానీ అవి రీసైకిల్ చేసిన రేషన్ బియ్యమా కాదా? అని నిర్ధారించుకున్నాకనే మాట్లాడుతానని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
నిజాయితీగా వ్యాపారాలు చేసుకునేవారికి తమ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందీ కలిగించదని, ఒకవేళ కంటెయినర్లలో ఉన్న బియ్యం రేషన్ బియ్యం కాకపోతే నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చని అన్నారు. కానీ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లయితే సంబందిత వ్యక్తులు ఎంత పెద్దవారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
కానీ కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నవారికి రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోర్టులు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోకుండా ఉంటారా?కనుక రాష్ట్రంలో అన్ని పోర్టులలో తనికీలు చేప్పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read – జగన్ అప్పులు చేసిపోతే.. చంద్రబాబు నాయుడు…
ముఖ్యంగా ఇంటి దొంగలను కనిపెట్టాలి. ఇన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యం ఎవరు పట్టిస్తున్నారో గుర్తించి చర్యలు తీసుకుంటేనే ఈ అక్రమ రవాణాకు బ్రేక్ పడుతుంది. లేకుంటే ఇప్పుడు తాత్కాలికంగా నిలిచిపోయినా, కొంత కాలం తర్వాత మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుంది.