
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఇంచుమించు ఒకేసారి రెండు పేరు మార్పులు జరిగాయి. ఆంధ్రాలో వైఎస్సార్ జిల్లా పేరుని వైఎస్సార్ కడప జిల్లాగా మార్చగా, తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వైఎస్సార్ జిల్లా పేరులో ‘కడప’ని జోడించిందే తప్ప పేరులో ‘వైఎస్సార్’ని తొలగించలేదు.
Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
తెలంగాణలో విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగిస్తే అభ్యంతరం చెప్పేవారు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా వారి అభ్యంతరాలను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోదు. కనుక వాళ్ళు నీసంకోచంగా ఆయన పేరు తొలగించేసింది.
కానీ ఆంధ్రాలో వైఎస్సార్ పేరు తొలగిస్తే రాద్ధాంతం చేయడానికి వైసీపీ సిద్దంగా ఉంటుంది. కనుక దానికి ఆ అవకాశం ఈయడం దేనికని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!
కానీ ‘కడప’ అంటే శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి ‘దేవుని గడప’ వంటిది కనుకనే ఆ జిల్లాకు ‘కడప’ అని పేరున్నప్పుడు, జగన్ ప్రభుత్వం దానిని తొలగించి వైఎస్సార్ జిల్లాగా మార్చినందుకు నేటికీ చాలా మంది అభ్యంతరం చెపుతూనే ఉన్నారు.
కనుక కూటమి ప్రభుత్వం ఎలాగూ పేరు మార్చుతున్నప్పుడు మళ్ళీ యధాప్రకారం కడప జిల్లాగా మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు, విశ్వవిద్యాలయాల పేర్లు మారిపోతుంటే దాని వలన అనేక కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కనుక కనీసం పేర్ల మార్పు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం చాలా అవసరం.