Nandamuri Taraka Rama Rao

ఓ రాజకీయ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ నాలుగు దశాబ్ధాలు మనుగడ సాగించడం, మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రాగలడం సామాన్యమైన విషయమేమీ కాదు. జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బీజేపిలకే ఇది సాధ్యం.

ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మాత్రం నేటికీ అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమిలో, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా నిలిచే ఉంది. అంతే కాదు.. కోటి సభ్యత్వాలతో నేటికీ ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజల ఆదరణ పొందుతూనే ఉంది.

Also Read – ఏడుకొండలవాడా… ఈ సీబీఐ అరెస్టులు ఏమిటి?

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నేడు అనేకమంది నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఆయనకు తీరని అపకారం చేశారని అపవాదుని భరిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఇంతగా పురోగమించి కోటి సభ్యత్వాలతో నేడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది కదా?

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలు గర్వపడేవిదంగా రాజధాని అమరావతి నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రం మళ్ళీ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటమే కాదు.. తెలుగువారి సత్తా ఏమిటో యావత్ దేశానికి, లోకానికి చాటి చెపుతున్నారు. ఇదే కదా.. ఎన్టీఆర్‌ కూడా కోరుకున్నది.

Also Read – దేవి…దుళ్లగొట్టేసాడుగా..!

ఏనుగు వెళుతుంటే వీధిలో కుక్కలు మొరుగుతూనే ఉంటాయాయి. అదేవిదంగా సిఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నప్పుడు ఈర్ష్యతో మొరిగేవారిని పట్టించుకోనవసరం లేదు.

కానీ అప్రమత్తంగా లేకపోతే కుక్కలు కూడా ఏనుగుని కరిచి గాయపరచగలవు. కనుక టీడీపీ దాని అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!


ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు కనుక ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ సాధించగలిగితే ఆ మహానీయుడి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది.