Nandigam Suresh police case, AP YSRCP MP arrest, Suresh violence controversy, TDP worker assault, YSRCP repeat offense, Suresh jail news

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ని తూళ్ళూరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఇసుకపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్తపై శనివారం రాత్రి దాడి చేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు తూళ్ళూరు పోలీసులు నందిగం సురేష్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్‌ చేశారు.

శనివారం రాత్రి ఇసుకపల్లి రాజు తన స్నేహితులతో కలిసి ఉద్దండరాయునిపాలెంలో రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతూ ఉండగా నందిగం సురేష్‌ తాలూకు కారు వేగంగా దూసుకు వెళ్ళింది. అప్పుడు రాజు మందలించగా అతను వెళ్ళి నందిగం సురేష్‌ అనుచరులను వెంట బెట్టుకొని వచ్చాడు. అందరూ కలిసి రాజుని చితకబాది బలవంతంగా తమతో తీసుకువెళ్ళారు.

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?

మళ్ళీ నందిగం సురేష్‌, ఆయన అన్న ప్రభుదాస్ వారి కుటుంబ సభ్యులు రాజుని బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. రాజు కుటుంబ సభ్యులు వచ్చి అతనిని వారి నుంచి విడిపించుకొని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో చేర్చి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి వారందరిపై పిర్యాదు చేశారు.

నందిగం సురేష్‌ చాలా రోజులు జైల్లో గడిపిన తర్వాత కొన్ని వారాల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ ఈ కేసులో మళ్ళీ అరెస్ట్‌ అయ్యారు. ఈసారి తనతో పాటు అన్న ప్రభుదాస్‌ని, అనుచరులను కూడా వెంటపెట్టుకొని జైలుకి వెళతారేమో?

Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?


ఎంపీ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా నందిగం సురేష్‌ ఇంకా ఈవిదంగా వ్యవహరిస్తుండటం, అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళ్ళి వస్తుండటం చూస్తే ఆయన ధోరణి ఏమాత్రం మారలేదని స్పష్టమవుతోంది. ఇతర పార్టీలలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినవారు సైతం ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటే, వైసీపీలో ఎంపీ స్థాయికి ఎదిగిన గోరంట్ల మాధవ్, నందిగం సురేష్ వంటివారుమాత్రం తమ తీరు మారదని పదేపదే నిరూపించి చూపిస్తూనే ఉన్నారు. యధా రాజా తదా ప్రజా అంటే ఇదేనేమో?