మొన్న సిఎం చంద్రబాబు నాయుడు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నప్పుడు, పోలీసులు అలవాటు ప్రకారం ముందు జాగ్రత్త చర్యగా సిపిఎం నేతలను అరెస్ట్ చేశారు. కొందరిని గృహనిర్బందం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పందిస్తూ, తాము ఎటువంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వకపోయినా పోలీసులు తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు.
Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?
గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలను తప్పు పట్టేవారని కానీ ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తుండటం భాధాకరమని ఆ లేఖలో ఆక్షేపించారు. అరెస్ట్ చేసిన సీపీఎం నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. “మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్… సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం.
ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను,” అని ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ నారా లోకేష్ మెసేజ్ పెట్టారు.
Also Read – శ్రీ వారి లడ్డు…ప్రసాదం కాదు ఒక ఎమోషన్..!
గత ప్రభుత్వంలో ఇటువంటి అరెస్టులు, గృహనిర్బందాలు నిత్యం జరుగుతూ ఉండేవి. వాటిని ప్రతిపక్షాలు ఖండిస్తూనే ఉండేవి. కానీ ఏనాడూ ఏ మంత్రి ఈవిదంగా తమ వలన తప్పు జరిగింది మన్నించమని అడిగింది లేదు. కనీసం స్పందించేవారు కాదు. పైగా ‘చూశారా మా తడాఖా…’ అన్నట్లు పైశాచిక ఆనందం పొందేవారు.
గత ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఉందని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ముఖ్యంగా ప్రభుత్వం మారినా ఇంకా పోలీసుల తీరు మారలేదని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలో వైసీపి విధేయులకు హెచ్చరికవంటిదే అని భావించవచ్చు.
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్
సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా… pic.twitter.com/mkpBnluRIR
— Lokesh Nara (@naralokesh) August 1, 2024