
గాంధీభవన్ లో జరిగిన యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే మీద వస్తున్న విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఈ కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కు తెలంగాణలో జీవించే కనీస హక్కు లేదంటూ మండిపడ్డారు.
Also Read – అయ్యో పాపం.. టీడీపీ కార్యకర్తలు!
అలాగే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు తో ఈ కులగణన మీద తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తూ కాకి లేఖలు చూపుతున్నారంటూ కేసీఆర్ ను తప్పటబట్టారు. బిఆర్ఎస్ పదేళ్ల అధికారంలో చేయలేని సమగ్ర కుల సర్వే ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదినెలలకే పూర్తి చేసి చూపించిందంటూ తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరించారు.
ఇక గుజరాత్ బీసీ ముఖ్యమంత్రి గా, దేశ ప్రధానిగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న మోడీ సామజిక వర్గం మీద కూడా రేవంత్ సంచలనమైన వ్యాఖ్యలు చేసారు. మోడీ తాను చెప్పుకుంటున్నట్టుగా, అందరూ భావిస్తున్నట్టుగా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని, 2002 వరకు మోడీ ఉన్నత కులస్తుడని మోడీ కులం మీద అందరికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు రేవంత్.
Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!
తానూ ఆషామాషీగా మోడీ కులం మీద ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం లేదని, తనకు అన్ని తెలిసే అసలు విషయాన్ని ప్రజలకు విస్తరిస్తున్నా అంటూ, మోడీ గుజరాత్ కు సీఎం అయిన తరువాతనే తనకున్న అధికారంతో తన కులాన్ని బీసీలలో కలుపుతూ చట్టం చేసారని, అందువల్ల మోడీ ఒక ‘లీగల్లీ కన్వర్టర్ బీసీ’ అంటూ రేవంత్ దేశ ప్రధాని కులం మీద కామెంట్స్ చేసారు.
అయితే ఇక ముఖ్యమంత్రిగా రేవంత్, ప్రధాని మోడీ మీద చేసిన ఈ వ్యాఖ్యలకు అటు బీజేపీ నేతల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రానుందో చూడాలి. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన కులగణన దేశ ప్రధాని కులం లెక్క వరకు పాకిందన్న మాట.
Also Read – జగన్ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!
రాజకీయాలలో ఏదయినా ఒక అంశాన్ని తమ రాజకీయ అవసరాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లగల సత్తా రాజకీయ నాయకులకు సాధ్యమనేది ఈ కామెంట్స్ తో రేవంత్ మరోసారి చేసి చూపించారు.