notices-to-kcr....for-jagan-mohan-reddy

ముందే చెప్పుకున్నట్లు, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్, మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ ముగ్గురికీ నేడు నోటీసులు పంపింది.

జూన్ 5న కేసీఆర్‌, 6 న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ కమీషన్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

Also Read – జగన్‌ ఆంధ్రా పరువు తీసేస్తే.. చంద్రబాబు నాయుడు..

జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ వీరు ముగ్గురినీ ప్రశ్నించకుండానే తుది నివేదిక సిద్దం చేస్తున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బహుశః అందువల్లే కమీషన్ గడువు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ వారు ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది.

కేసీఆర్‌ హయాంలో ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రిలో పాత టెక్నాలజీతో విద్యుత్ ప్లాంట్స్ నిర్మాణాలు ప్రారంభించడంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసింది. ఆ కమీషన్ నోటీస్ పంపితే కేసీఆర్‌ విచారణకు హాజరుకాకుండా, 10-15 పేజీలతో ఘాటుగా ఓ లేఖ వ్రాసి పాపినహకారు. తనని విచారించే అర్హత కమీషన్‌కి లేదంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు.

Also Read – ఫోన్ ట్యాపింగ్: ఒక్క ట్విస్టుతో కధ క్లైమాక్స్‌కి.. భలే ఉందే!

కనుక ఈ కేసు విచారణకు హాజరవుతారనుకోలేము. కానీ ఈ కేసు పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి ప్రయత్నించడం ఖాయమే.




తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయో, ఏపీ మద్యం కుంభకోణంలో కూడా అదే స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఆ కేసులో కేసీఆర్‌కి నోటీస్ వెళ్ళింది కానీ ఇక్కడ ఏపీలో మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులందరినీ పోలీసులు అరెస్ట్‌ చేసినా, ఇంతవరకు జగన్‌కు పిలుపు వెళ్ళలేదు. నోటీస్ పంపితే ఈ విషయంలో కూడా కేసీఆర్‌, జగన్‌ రాజకీయ జీతాలలో ఎదుగుదల, ఓటమి, ఫామ్ హౌస్ కాలక్షేపం వరకు అన్నీ పక్కా మ్యాచింగ్ అవుతాయి కదా?

Also Read – కమ్మవారి ఊసు జగన్‌ కేల?