ktr Padayatra or Jail Which is best

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌ చేశారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు చేశారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి చేశారు ముఖ్యమంత్రి అయ్యారు.

అందువల్లే తెలంగాణ ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా పాదయాత్రలు చేశారు. వారందరూ ముఖ్యమంత్రులు కాలేకపోయినా మంత్రులు అవగలిగారు.

Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…

యువ పాదయాత్ర చేసిన నారా లోకేష్‌ మంత్రి అయ్యారు. కనుక పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి కాలేకపోయినా తప్పకుండా మంత్రి అయ్యే అవకాశం ఉంటుందనే నమ్మకం రాజకీయ నాయకులలో ఏర్పడింది.

ఇదేవిదంగా జైలుకి వెళ్ళివచ్చినవారు కూడా ముఖ్యమంత్రులు అవుతుండటంతో కేటీఆర్‌ వంటివారు జైలుకి వెళ్ళేందుకు తహతహలాడారు.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

కానీ పాదయాత్రలు చేసినవారందరూ లేదా జైలుకి వెళ్ళి వచ్చినవారందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు కాలేరని కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల తదితరులు నిరూపించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాదయాత్రలా జైలుకి వెళ్ళడమా ఏది బెస్ట్? ఏది సులువు? ఏది సుఖం? అని ఆలోచిస్తున్నారు.

ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని గట్టి నమ్మకంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కానీ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తానని చెప్పారు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

పాదయాత్ర సెంటిమెంట్ ఇంత బలంగా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే చేస్తానని చెప్పడం అంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానని చెప్పిన్నట్లే కదా?




ఏది ఏమైనప్పటికీ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న రాజకీయ నాయకులు పదవిపై ఆశతోనైనా పాదయాత్ర చేస్తే ప్రజల కష్టాలు కళ్ళారా చూస్తారు కనుక వారిలో ఎంతో కొంత మార్పు తప్పక వస్తుంది. వాళ్ళు అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు తప్పక జరుగుతుంది కనుక పాదయాత్రలను స్వాగతించాల్సిందే!