
భారత్-పాక్ మద్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇరు దేశాల మద్య పరస్పర నమ్మకం లేదు కనుక నేటికీ ఏ క్షణంలో ఏమైనా జరుగవచ్చని అప్రమత్తంగా ఉంటున్నాయి.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
కానీ భారత్ కాల్పుల విరమణకు అంగీకరించి ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడంతో మళ్ళీ పాక్ పాలకులకు కొండంత ధైర్యం వచ్చింది.
కనుక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ సైన్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “భారత్‌తో శాంతి చర్యలకు మనం సిద్దమే. కానీ కశ్మీర్ సమస్యపై చర్చించడానికి భారత్ అంగీకరిస్తేనే సాధ్యపడుతుంది. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోతే శాంతి చర్చల వలన ఫలితం ఉండదు.
Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్ పట్టించుకోవట్లేదే!
కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. వారి గొంతులను భారత్ సైనిక బలంతో అణచివేస్తోంది. వారి తరపున భారత్‌తో చర్చించేందుకు పాక్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుంది,” అని అన్నారు.
పాక్ వందల కొద్దీ డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు ప్రయోగించినప్పటికీ భారత్ సరిహద్దు జిల్లాలపై కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ భారత్ నేరుగా రావల్పిండిలో పాక్ సైనిక, వైమానిక కేంద్రాలపైనే క్షిపణులతో దాడులు చేసి తన సత్తా చాటుకుంది.
Also Read – జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
కనుక పాక్ పాలకులు, సైన్యాధికారులు తమ ప్రజలకు, ప్రపంచదేశాలకు తమ మొఖాలు చూపించలేకపోతున్నారు. కానీ ఎల్లకాలం అలాగే ఉండిపోలేరు కనుక ఈ అవమానం దిగమింగుకొని మళ్ళీ ఈవిదంగా వంకర మాటలు మాట్లాడుతూ పాక్ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
పాక్ ప్రజలు దేశాభివృద్ధిని కోరుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు వంటివి కల్పించి తమ జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నారు. అవన్నీ పాక్ పాలకుల వల్ల అయ్యే పనులు కావు కనుక ‘కశ్మీర్ సమస్య’ ముఖ్యమన్నట్లు మాట్లాడుతున్నారు.
పాక్ ఉగ్రవాదులను కట్టడి చేసి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని అప్పగించాలని భారత్ కుండ బద్దలు కొట్టినట్లు చెపుతుంటే, పాక్ ప్రధాని దానికి జవాబు చెప్పకుండా కశ్మీర్ సమస్య గురించి మాట్లాడేందుకు భారత్ అంగీకరిస్తేనే శాంతి చర్చలకు అంగీకరిస్తామని షరతు విధించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
భారత్‌తో శాంతి చర్చలకు పాక్ సిద్దపడినా భారత్ సిద్దంగా లేదని కనుక శాంతి చర్చలకు భారత్ షరతులు విధించగలదు కానీ తాము కాదని పాక్ ప్రధానికి బాగా తెలుసు. కానీ కుక్క తోక వంకర, పాక్ వక్ర బుద్ధి ఎప్పటికీ మారదు. కనుక పాక్ పాలకులు ఇలాంటి మాటలతో ప్రజలను మభ్య పెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారని అనుకోవచ్చు.