
ఆపరేషన్ సింధూర్ కు ప్రతి చర్యగా భారత్ పై జరిపిన దాడిలో పాక్ విజయం సాధించిందంటూ అటు పాక్ ఆర్మీ చీఫ్, ఇటు పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మీడియా ముందుకొచ్చి తమ పౌరులను ఉద్దేజపరచడానికి, వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి నానా చెత్త వాగుతున్నారు.
భారత్ పై పాక్ పై చేయి సాధించింది, విజయం మనదే, సీజ్ ఫెయిర్ కోసం మేము అభ్యర్దించలేదు, పాకిస్తాన్ శాంతి కోరుకునే దేశం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంగించలేదు, పాక్ ఆర్మీ ఒక ప్రొఫిషనల్ ఆర్మీ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!
అయితే వీరి అసత్య ప్రచారాలకు ఇంకాస్త బలం చేకూరేలా నేడు పాకిస్తానీలు భారత్ పై జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించామంటూ కరాచీలో విక్టరీ ర్యాలీ ని నిర్వహించారు. అనూహ్యంగా ఈ ర్యాలీ కి మద్దతిస్తూ ఇందులో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భారతీయులంతా ‘పాకీ’స్తాన్ బుద్ధులివేనా అంటూ మండిపడుతున్నారు.
భారత్ సైన్యంతో పోరాడలేక అమాయక ప్రజలను బలితీసుకున్న వారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారు, భారత్ ఎదురుదాడితో కాల్పుల విరమణ కోసం కాళ్ళ బేరానికి వచ్చినవారు, ఇప్పటి వరకు భారత్ తో జరిగిన ఏ యుద్ధంలోనూ ఒక్కసారి కూడా విజయం సాధించలేని వారు ఇప్పుడు విక్టరీ ర్యాలీ లు అంటూ సంబరాలు చేసుకోవడం, దానికి మళ్ళీ మాజీ క్రికెటర్ హాజరవడం పాకిస్తాన్ దిగజారుతనానికి నిదర్శనం.
Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?
పెహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఈ మాజీ క్రికెటర్ భారత్ ను తప్పుపడుతూ సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టడం, ఇప్పుడు పాకిస్తాన్ చేసే అసత్య ప్రచారాలకు వంత పాడడం ఆయన నీచత్వానికి అద్దం పడుతుంది.
భారత్ మొదలు పెట్టిన ఆపరేషన్ సింధూర్ మరో రెండు రోజుల పాటు కొనసాగినట్టయితే పాకిస్తాన్ భవిష్యత్ అంధకారంలో మునిగిపోయేది అనే మాట ప్రపంచం గుర్తించిన సత్యమే, అయినప్పటికీ పాక్ కింద పడ్డా పై చెయ్యి నాదే అన్నట్టుగా ఇతండవాదం చేస్తూ మళ్ళీ భారత్ తో చర్చలంటూ ముందుకురావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో.?