మెగా vs అల్లు మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తూ ఉండేది. అయితే మొన్నీమధ్య ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ వార్తకు బలం చేకూర్చే సంఘటన ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన సంగతి తెలిసిందే.
Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్ పుచ్చుకుంటున్నారు!
నంద్యాల వైసీపీ అభ్యర్థికి తన మద్దతు తెలియ చేయడానికి అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు నంద్యాల విచ్చేసారు. అదే రోజు తన బాబాయ్ పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ అతని తల్లి సురేఖ, అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు.
ఈ ఒక్క సంఘటన అల్లు క్యాంఫౌండ్ మీద మెగా ఫాన్స్ యుద్ధం ప్రకటించడానికి నాందిగా మారింది. ఇన్నాళ్లు కోల్డ్ వార్ గా సాగిన ఈ ఇద్దరి ఫాన్స్ మధ్య గొడవ ఇక అధికారికంగా మొదలయ్యింది. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ కి మద్దతు తెలపడం పుష్ప 2 సినిమా మీద పడింది.
Also Read – వరద కష్టాలతో ప్రభుత్వానికి కొత్త పాఠాలు… నేర్చుకోవలసిందే!
వైసీపీ వ్యతిరేక వర్గమంతా అల్లు అర్జున్ మీద గుర్రుగా ఉంటూ బ్యాన్ పుష్ప 2 అనే హాష్ టాగ్ ను ట్రెండ్ చేసారు. అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లేటవడంతో సినిమా విడుదల తేదీని ఆగష్టు 15 నుండి డిసెంబర్ 6 కి తీసుకువెళ్తున్నాం అంటూ చిత్రం బృందం ప్రకటించింది.
దీనితో నంద్యాల ఇష్యూ తోనే పుష్ప వెనక్కి తగ్గాడు అంటూ వార్తలు ఊపందుకున్నాయి. పుష్ప 2 సినిమా మీద ఇంకా ఈ రచ్చకు ఎండ్ కార్డు పడకముందే పవన్ మరో బాంబ్ పేల్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో కర్ణాటకకు వెళ్లిన పవన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు పుష్ప సినిమాను ఉద్దేశించినవే అంటూ ఆ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?
గతంలో హీరోలు సినిమాలలో అడవులను కాపాడే పాత్రలు చేసేవారు, కానీ ఇప్పుడు సినిమాలలో అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్న వారిని హీరోలుగా చూస్తున్నాం, పరిస్థితులు ఇంతలా మారిపోయాయి. నేను ఒక సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తినే కానీ ఇటువంటివి చేసే ముందు నేను సరిగా ఉన్నానా లేదా అన్నది చూసుకుంటా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ అభిమానులు, వైసీపీ వ్యతిరేకవర్గమంతా పవన్ వ్యాఖ్యలు పుష్పను ఉద్దేశించే అంటూ పుష్ప తగ్గాల్సిందే అంటూ సినిమా మీద కౌంటర్లు వేస్తున్నారు. అలాగే బన్నీ అభిమానులు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటూ అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు. మరి పవన్ వ్యాఖ్యలకు పుష్ప టీమ్ కౌంటర్ ఇచ్చే సాహసం చేయగలదా?