Pawan Kalyan Angry on Tollywood

గత కొద్దీ రోజులుగా టాలీవుడ్ లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల మధ్య నడుస్తున్న పర్శంటేజ్ ల పంచాయితీ చిలికి చిలికి రాజకీయ వేదికలెక్కింది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బందు అంటూ వస్తున్న వార్తలతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ స్పందించిన తీరుతో ఈ అంశం మరికాస్త వివాదంగా మారింది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు ఇప్పుడు కుట్ర పూరితంగానే థియేటర్ల బందుకు పిలుపునిస్తున్నారని, దీని పై తక్షణమే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి.

Also Read – కుప్పం ఘటన: వైసీపీ మొదలుపెట్టేసిందిగా!

ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాయకుడు, సినీ ఇండస్ట్రీలో అగ్రనటులలో ఒకరైన పవన్ సినిమాల పై కుట్రా.? అంటూ అందరు ఆ నలుగురు ఎవరు అనేదాని మీద చర్చించుకుటున్న తరుణంలో అనూహ్యంగా ఇటు పవన్ కార్యాలయం నుంచి కూడా ఇండస్ట్రీ వైఖరి పై అసహనం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన వెలువడింది.

దీనితో ఇప్పుడీ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తుంది, అయినప్పటికీ ఇంతవరకు తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసారా.?

Also Read – మిథున్ రెడ్డి ఏ-4 అంటే సరిపోదు…

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇండస్ట్రీలో ఎవరి సినిమా విడుదల సందర్భంలో వారు వచ్చి తమ సినిమా టికెట్ల పెంపు కోసం ప్రభుత్వానికి వినతులు చేసుకుంటున్నారు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారంతా ఏకతాటి మీదకొచ్చి ఇండస్ట్రీ బాగు కోసం ప్రభుత్వం తో చర్చలు జరిపారా.? అంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇండస్ట్రీ వారికీ ఒక హెచ్చరిక ప్రకటన విడుదల చేసారు పవన్.

గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ఎంతగా ఇబ్బంది పెట్టిందో, ఇండస్ట్రీ పెద్దలను ఎంతలా అవమానించిందో మరిచిపోయారా.? ఇక పై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, కేవలం సినీ సంఘాల ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వం తో చర్చలకు రావాలి అంటూ ఆదేశించారు పవన్.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

అయితే ఇండస్ట్రీ సంఘాలను ఉద్దేశించి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా ధర్మ బద్దమైనవే అని చెప్పవచ్చు. అటు ఇండస్ట్రీ వ్యక్తిగా ఇటు ప్రభుత్వంలో భాగమైన పవన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇండస్ట్రీ వారికి తగిన సూచనలు చేస్తూనే వచ్చారు. ప్రతి సారి సినిమా విడుదల సమయంలో ప్రభుత్వాల ముందు అర్జీలతో కుస్తీపట్లెందుకు.?

సినిమా బడ్జెట్ బట్టి, ఆ సినిమాకు ఎంత వరకు ధరను నిర్ణయించాలో అన్ని సంఘాల వారు కూర్చొని చర్చించుకుని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇస్తే దాని పై సమగ్ర విచారణ జరిపిన తరువాత ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా సినీ ఇండస్ట్రీ బాగు కోసం తగిన నిర్ణయం తీసుకుంటుంది అంటూ పవన్ ఇండస్ట్రీ పెద్దలకు మొదటి నుంచి సూచనలు చేస్తూనే వచ్చారు.

అయినా కూడా ఆ సూచనలను పట్టించుకోని టాలీవుడ్ ప్రతి సారి సినిమా విడుదలకు ముందు ప్రభుత్వ వద్దకు రావడం, టికెట్ ధరల పెంపు ప్రతిపాదనలు తేవడం ఇక ఆ పై మాయమవడం కామన్ గా జరిగిపోతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇండస్ట్రీ పతనం కోసం ఎన్నో ప్రభుత్వ జీవోలను తీసుకువచ్చి ఇండస్ట్రీ ప్రగతిని అడ్డుకున్నారు.

కానీ ఏపీలో ఇప్పుడా పరిస్థితి లేదు. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కానీ, ఇటు ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కానీ, అటు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కానీ ఇండస్ట్రీ కి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు. అలాగే ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధికి తగిన ప్రోత్సహకాలు అందిస్తాం అంటూ భరోసాలు ఇస్తున్నారు.




అయినా కూడా టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం తో కోరండి మరి కొరివి పెట్టుకుంటున్నట్టుగా ఉంది. సంధ్యా థియేటర్ ఘటనతో ఇప్పటికే అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో, అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో శత్రుత్వం పెట్టుకున్న టాలీవుడ్ ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వ అసహనాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలి మరి ఈ సమస్యను టాలీవుడ్ ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటుందో..!