pawan-kalyan-present-in-cabinet-meeting

నేడు సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కీలకమైన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ డుమ్మా కొట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ చెక్కేశారంటూ వైసీపి సొంత మీడియా, సోషల్ మీడియాలో వ్రాసిపడేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనతో తీవ్ర ఆందోళన చెందిన సిఎం చంద్రబాబు నాయుడు దాని గురించి ఆరా తీస్తున్నారని వ్రాశారు.

Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?

వాస్తవానికి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీలకు మంత్రులు ఫోన్‌ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా ఏదైనా సమస్య గురించి అడిగితే సీఐ, ఎస్ఐలే అందుకు బాధ్యులని చెపుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు.

వారు ఆవిదంగా వ్యవహరిస్తుండటం వలననే మొన్న తాను హోంమంత్రి, పోలీసులని ఉద్దేశ్యించి ఆ విదంగా మాట్లాడాల్సి వచ్చిందని పవన్‌ కళ్యాణ్‌ వివరణ ఇచ్చారు.

Also Read – హైడ్రా ముగిసిన అధ్యాయమేనా.?

సోషల్ మీడియాలో వైసీపి తమ గురించి, ప్రభుత్వం గురించి, చివరికి ఇళ్ళలో ఉండే తమ ఆడవాళ్ళ గురించి కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే సంబందిత పోలీస్ అధికారులు పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఫిర్యాదు చేశారు. నేటికీ కొంతమంది పోలీస్ అధికారులు వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వారిని కాపాడుకొస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రివర్గ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ వైసీపి దుష్ప్రచారం గురించి, వారికి అండగా నిలుస్తున్న పోలీస్ అధికారుల గురించే మాట్లాడుతుంటే, ఆయన మంత్రివర్గ సమావేశానికి డుమ్మాకొట్టి ఢిల్లీ చెక్కేశారని వైసీపి దుష్ప్రచారం చేస్తుండటం గమనిస్తే అది ఎంత బరితెగించిందో అర్దం చేసుకోవచ్చు.

Also Read – జగన్‌ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!

పోలీస్ అధికారుల విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జగన్‌ చెప్పిన్నట్లు ఆడిన అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేశారు. వారందరూ జగన్‌ అండ చూసుకొని రెచ్చిపోయినవారే.

కానీ నేటికీ పోలీస్ అధికారుల తీరు మారలేదని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మంత్రివర్గ సమావేశంలో ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.




పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన విషయాలన్నిటినీ సావధానంగా విన్న సిఎం చంద్రబాబు నాయుడు నెల రోజులలోగా మళ్ళీ పోలీస్ వ్యవస్థని గాడిన పెడతానని, లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో దుష్ప్రచారం చేస్తున్న వైసీపికి రుచి చూపిద్దామని అన్నారు. జగన్‌ హయాంలో కొందరు పోలీస్ అధికారులు మొండిబారిపోయి ఈవిదంగా తయ్యారయ్యారని సిఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కనుక అటువంటి అధికారులకు, రెచ్చిపోతున్న వైసీపి సోషల్ మీడియాకు ఈ మంత్రివర్గ సమావేశం వేదికగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చివరి హెచ్చరికలు చేసిన్నట్లు గ్రహిస్తే వారికే మంచిది. కాదని ఇంకా జగన్‌ని నమ్ముకొని రెచ్చిపోతే వాలంటీర్లలాగే వారు కూడా నష్టపోవడం ఖాయం.