Pawan Kalyan Ration Rice Scam

కాకినాడ పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన ఆకస్మిక తనిఖీలో భాగంగా ‘స్టెల్లా’ అనే షిప్ లో జరుగుతున్న అక్రమ బియ్యం తరలింపు విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అలాగే ఆ తనిఖీలో భాగంగా అక్కడ పవన్ చెప్పిన ‘సీజ్ ది షిప్’ డైలాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అయితే దీని మీద విమర్శలకు దిగిన వైసీపీ నేతలు ఇది సినిమా కాదు, నువ్వు సీజ్ ది షిప్ అనగానే షిప్ ని సీజ్ చెయ్యడానికి అంటూ సెటైర్లు పేల్చారు.

Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?

దానికి తోడు తాము దొంగ అని దొరికిన ప్రతిసారి కూడా వైసీపీ ఎదుట వారి మీద బురద జల్లి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పవన్ పట్టుకున్న అక్రమ బియ్యాన్ని పక్కన పెట్టి తనను కూడా పోర్ట్ అధికారులు షిప్ దగ్గరుకు వెళ్లనివ్వడం లేదు అని చెప్పిన మాటలను పట్టుకుని అలా అయితే పవన్ రాజీనామా చెయ్యాలని ఒకరు,

అసలు పవన్ ను నిర్బంధించిన ఆ వ్యక్తులెవరు అంటూ మరొకరు మీడియా ముందుకొచ్చి హడావుడి చేసి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తమతో పాటు తమ పార్టీని నవ్వులపాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్టెల్లా షిప్ పవన్ చెప్పినట్టు సీజ్ చెయ్యబడుతుందా.? లేక వైసీపీ నేతలు వాదిస్తున్నట్టు ఆ అవకాశం లేకుండా పోతుందా.? అనేదాని మీద ఉత్కంఠ మొదలయ్యింది.

Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!

ఆ ఊహాగానాలకు తెరదింపుతు ‘షిప్ వాజ్ సీజ్డ్’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. ప్రభుత్వం పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్టెల్లా షిప్ ను స్వాధీనం చేసుకున్నాము, అసలు ఈ బియ్యం పోర్ట్ దాకా ఎలా వచ్చాయి అనే దాని మీద సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు.

ఇందుకు గాను రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌరసరఫరాల శాఖ, పోర్ట్ అథారిటీ అధికారులతో కూడిన ఐదుగురి సభ్యులతో ఒక బృందాన్ని నియమిస్తున్నట్టు తెలిపారు. ఇక నుండి పోర్ట్ కార్యక్రమాల్ని ఈ బృందం ఆధ్వర్యంలో ముందుకెలనున్నట్లు సమాచారం. నేడు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ లో కూడా ఈ విషయమై సమగ్ర చర్చ జరిగినట్లు, ఈ అక్రమ రవాణా నిలుపుదలకు కట్టుదిట్టమైన చర్యలు చెప్పటాడానికి ప్రభుత్వం కూడా అక్రమార్కుల మీద ద్రుష్టి పెట్టనుంది.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

అయితే సీజ్ ది షిప్ తో మొదలైన కూటమి ప్రభుత్వ ఆట షిప్ వాజ్ సీజ్డ్ తో ఒక అడుగు ముందుకేసింది, అలాగే ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి మరో అడుగు ముందుకెళ్లింది. ఇక ఇన్నాళ్లు కాకినాడ లో గుట్టుగా నడుస్తున్న ఈ మాఫియా వెనుక ఉన్న ఆ దృష్ట్యా శక్తి ఎవరన్నది బయటకు తీయడం తో దీనికి ఇంటర్వెల్, సదరు అక్రమదారులను చట్ట ముందు నిలబెట్టడంతో కథ క్లైమాక్స్ కు చేరుతుంది.




మరి అక్కడి దాక సినిమాను ముందుకు తీసుకువెళ్లే సాహసం కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందా.? ఆ మాఫియా చేయనిస్తుందా.? అనేదే ఇక్కడ ప్రశ్న..!