
కొమ్మకు కొమ్మకు సన్నాయి అన్నట్లు వైసీపీ అధినేత జగన్ మొదలు కార్పొరేటర్ వరకు ఎవరిని కదిపినా తప్పకుండా ఓ అవినీతి, అక్రమం, భూకబ్జా లేదా దౌర్జన్యం ఫ్లాష్ బ్యాక్ బయటపడుతుందని ఈ కేసుల వరద చూస్తే అనిపిస్తుంది.
మాజీ మంత్రులలో అంబటి రాంబాబు వంటి కొందరు అవసరానికి మించి మాట్లాడుతుంటారు కానీ వారిపై ఇంత వరకు ఏ కేసు బయటపడలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మీడియాతో పెద్దగా మాట్లాడే అలవాటు లేదు. కానీ నిశబ్ధంగా భూకబ్జాలకు పాల్పడి కేసులో చిక్కుకున్నారు.
Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?
అటవీశాఖ అధికారులు సర్వే చేసి ఆయన చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేటలో అటవీ భూములు కబ్జా చేశారని తేల్చి చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇది కాక పెద్దిరెడ్డి భూకబ్జా కధలు ఇంకా చాలానే ఉన్నాయి. మదనపల్లిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-42) ని ఆనుకొనున్న బికేపల్లిలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట ఓ అర ఎకరం కొనుగోలు చేసి, దాని పక్కనే ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు! ఆ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్ గారు?
పెద్దిరెడ్డి వంటి అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అటువంటిది రెవెన్యూ అధికారులు ఆయన కబ్జా చేసిన1.35 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం మామూలు విషయం కాదు. కానీ చేసి చూపించారు. మరి అటవీ భూముల కబ్జా కేసులో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారా లేదా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? చూద్దాం.