ఏపీలో పోలింగ్‌ శాతం, సరళి చూసినప్పుడే జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపి నేతలందరికీ తమ జాతకాలు తెలిసిపోయి ఉంటాయి. అందుకే అప్పుడే అందరూ మూటాముల్లె సర్దేసుకుంటున్నారని టిడిపి నేతలు ఆక్షేపిస్తున్నారు.

Also Read – అభిమానులూ… పవన్‌ కళ్యాణ్‌కి చెడ్డపేరు తేవద్దు

ఐదేళ్ళుగా చిత్తూరు జిల్లాలో యధేచ్చగా ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు తవ్వేసుకొని దోచుకున్న మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి కూడా అలాగే విదేశాలకు తరలించేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

ఆయన తన సంస్థలకు చెందిన భారీ టిప్పర్లు, జేసీబీ తదితర వాహనాలలో డబ్బు మూటలు, బంగారు ఆభరణాలు. ఇంకా అనేక విలువైన వస్తువులను పెట్టి, చెన్నై, ముంబై పోర్టుల ద్వారా షిప్పులలో ఆఫ్రికా దేశంలోని తమ సంస్థలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read – మారాల్సింది ఎవరు? చంద్రబాబా… జగనా?

వంద భారీ వాహనాలను ఎంత గుట్టుగా తరలించినా మీడియాకు తెలియకుండా దాచడం సాధ్యం కాదు. కనుక మీడియాలో కూడా ఈ వాహనాల తరలింపు వార్తలు వచ్చాయి.

వీటిపై పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి స్పందిస్తూ,”మా సంస్థలకు చెందిన వంద వాహనాలను ఆఫ్రికా పంపిస్తున్న మాట వాస్తవమే. కానీ టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్లు ఓటమికి భయపడి వాటిని తరలించడం లేదు. దక్షిణాఫ్రికాలో మా పిఎల్ఆర్, జస్విన్ సంస్థలు ఫెర్రో మాంగనీస్, ఫెరో సిలికా మైనింగ్ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.

Also Read – కేటీఆర్‌కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదర్శమట!

కనుక అక్కడ మైనింగ్ కోసం ఇక్కడి నుంచి వంద వాహనాలను ఆఫ్రికాకు పంపిస్తున్నాము. ఆ వాహనాలలో డబ్బు, బంగారం వంటివి ఏవీ దాచి పెట్టి పంపించడం లేదు. నేను ఎక్కడికి పారిపోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఈసారి మాకు 150 కంటే ఎక్కువే సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము,” అని పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చెప్పారు.

అక్రమాస్తుల కేసులన్నీ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలే తప్ప తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని జగన్మోహన్‌ రెడ్డి గత 12 ఏళ్ళుగా కేసులు నడిపిస్తూనే ఉన్నారు.

ఆ కేసులలో 16 నెలలు చంచల్‌గూడా జైల్లో ఉండివచ్చిన జగన్‌, అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తూ, “వివేకా హత్యతో తనకి సంబందం లేదని ‘చిన్న పిల్లోడు’ చెపుతుంటే నమ్మాలి కదా?” అని అంటారు.

మాచెర్లలో అల్లర్లు, విధ్వంసం సృష్టించి, పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రలే అని ఆరోపిస్తారు.

బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకణి కారు, దానిపై ఆయన పేరుతో జారీ చేసిన ఎమ్మెల్యే పాసు, కారులో పాస్ పోర్టు వగైరాలు లభిస్తే వాటితో తనకు సంబంధమే లేదంటారు కాకాణి.

అలాగే మంత్రి పెద్దిరెడ్డి కూడా వేలకోట్లు విలువైన తన వాహనాలను ఆఫ్రికాకు తరలించేస్తూ కాకమ్మ కధలు చెపుతున్నారు.

ఎలాగూ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు కదా?కనుక మరో 15 రోజులు ఆగి ముఖ్యమంత్రిగా జగన్‌, మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాతే వాహనాలను ఆఫ్రికాకు పంపించుకోవచ్చు కదా?కానీ ఫలితాలు వెలువడేలోగా హడావుడిగా తరలిస్తున్నారంటే ఓటమి భయంతోనే కదా?