
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ హయంలో ఏపీలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు, కలెక్షన్స్, వాటిలో వైసీపీ నేతల చిలక కొట్టుళ్ళ గురించి వివరించి ఈడీ విచారణకు ఆదేశించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వాటిపై మాజీమంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందిస్తూ, “ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ పేరు బయటకు వినపడకపోవచ్చు. కానీ దానిలో మీరు ఎంత పెట్టుబడి ఎవరి ద్వారా పెట్టారో రాజకీయాలలో ఉన్నవారందరికీ తెలుసు. అలాంటి మీరు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్ హర్ట్ అవరూ?
ఈవిదంగా పార్లమెంటులో, కౌరవులాంటి మీరందరూ మీ కౌరవసభలల, సమావేశాలలో, మీ సొంత మీడియాలో జగన్ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ, వ్రాస్తూ దుష్ప్రచారం చేసి జగన్ ప్రతిష్ట దెబ్బతీయాలనే మీ ప్రయత్నాలు ఫలించవు.
మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించమని అడిగారు కదా?మీ ఇష్టం వచ్చిన సంస్థలతో విచారణ జరిపించుకోండి. మాకేమీ భయం లేదు,” అని అన్నారు.
Also Read – జమ్ము కశ్మీర్ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
వైసీపీ నుంచి బయటకు వచ్చినవారు ఎవరైనా జగన్ మీద ఆరోపణలు చేస్తే, వెంటనే వారిపై ఈవిదంగా ప్రత్యారోపణలతో ఎదురుదాడి చేసి, అందరి దృష్టిని ఆ అంశంపై నుంచి మళ్ళించాలనే ఫార్ములాని వైసీపీ చాలా కాలంగానే అమలుచేస్తోంది.
జగన్ తన ఆస్తులు కొట్టేశారని బాలినేని ఆరోపణలు చేసినప్పుడూ ఇదే చేశారు. ఇప్పుడూ లావు కృష్ణదేవరాయలు ఆరోపణలు చేసినప్పుడూ ఇదే చేశారు.
Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!
కానీ ఎదురుదాడి చేయాలనే ఉత్సాహంలో వైసీపీలో ఉన్నవారందరూ అందినకాడికి దోచుకున్నారని, ఎంతో కొంత అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేశారని స్వయంగా ధృవీకరిస్తున్నామనే విషయం మరిచిపోతున్నారు.
బాలినేని ఒంగోలులో భూకబ్జాలకు పాల్పడ్డారని, వేలకోట్లు ఆస్తులు పోగేసుకున్నారని, రష్యాలో క్యాసినో ఆడేందుకు ప్రైవేట్ విమానంలో వెళ్ళి వచ్చేవారని వైసీపీ నేతలే చెప్పారు. అంటే బాలినేని అంత అవినీతిపరుడని వైసీపీలో ప్రతీ ఒక్కరికీ తెలుసన్న మాట! అదే విదంగా జగన్ అవినీతిపరుడని బాలినేని కూడా చెప్పారు.
ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు విషయంలో పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలు వింటే, వైసీపీలో ఎటువంటి వారున్నారో చెప్పుకుంటున్నట్లుంది.
అయినా గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడుగా పేర్ని నాని లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉండదూ?