
పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని, అక్కడే ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థని తమ క్షిపణులతో నేలమట్టం చేశామని పాక్ గొప్పలు చెప్పుకుంది.
ప్రధాని మోడీ వారికి చెప్పుతో కొట్టినట్లుగా నేడు ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్ళి, వాయుసేన అధికారులు, సిబ్బందితో కలిసి సుమారు గంటన్నర సేపు గడిపారు.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
ఈ సందర్భంగా వారి ధైర్య సాహసాలను ప్రధాని మోడీ మెచ్చుకొని శతృదేశం దాడుల నుంచి భారత్‌ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమని అభినందించడానికి ప్రధాని మోడీ స్వయంగా రావడం, తమతో మాట్లాడి ఆపరేషన్ సింధూర్ వివరాలు తెలుసుకోవడం, తమతో కలిసి ఫోటోలు దిగడంతో ఆదంపూర్ వాయుసేన సిబ్బంది ఆనందానికి అంతే లేదు.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన మనసులో ఆలోచనలని, ఆదంపూర్ వైమానిక స్థావరంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో దేశ ప్రజలతో పంచుకున్నారు… అని అనే కంటే ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశామని గొప్పలు చెప్పుకున్న పాక్ సైన్యాధికారులకు, పాక్ పాలకులకు చెప్పుతో కొట్టినట్లు జవాబు చెప్పారని అనుకోవచ్చు.
ముఖ్యంగా పాక్ చెపుతున్న అబద్దాలు, దుష్ప్రచారం గురించి యావత్ ప్రపంచదేశాలకు ఈవిదంగా తెలియజేశారని చెప్పవచ్చు.