Police Biryani Treat Borugadda Anil Kumar

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పోలీసుల తీరుని విమర్శించడం చాలా మందికి తప్పుగా అనిపించి ఉండవచ్చు. కానీ ఆయన విమర్శలు సహేతుకమే అని పోలీసులే నిరూపించారు.

పవన్‌ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వైసీపికి చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టు అతనికి జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది.

Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ని గుంటూరు జిల్లా ఏఆర్ ఎస్కార్ట్ పోలీసులు నిన్న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకి తరలిస్తుండగా దారిలో ఓ పెద్ద రెస్టారెంట్‌లో అతనితో కలిసి చికెన్, మటన్ బిర్యానీలు తిన్నారు!

వారందరికీ అనిల్ కుమారే బిల్లు చెల్లించారు. రిమాండ్‌ ఖైదీగా అనిల్ కుమార్‌తో కలిసి పోలీసులు రెస్టారెంట్‌లో విందు భోజనం చేస్తుండటం చూసినవారు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్ అయ్యింది. డిజిపి ద్వారకా తిరుమల రావు వెంటనే ఆ ఏడుగురు ఎస్కార్ట్ పోలీసులని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read – అప్పుడు తగ్గించారు…ఇప్పుడు తగ్గేదెలా అంటున్నారా.?

గమ్మతైన విషయం ఏమిటంటే వైసీపి సోషల్ మీడియా పెట్రేగిపోయి దుష్ప్రచారం చేస్తోందని, పోలీసులు కూడా వైసీపి నేతలపై చర్యలు తీసుకోకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని ఓ పక్క మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సిఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరగడం విశేషం.

ఎస్కార్ట్ పోలీసులకి బోరుగడ్డ అనిల్ కుమార్‌తో అంత అనుబందం ఉందా లేక ఆయన ఇప్పించే బిర్యానీలకు కక్కుర్తిపడి నిబందనలు ఉల్లంఘించారా? అనేది పక్కన పెడితే, తాము ఏపీ ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తీసుకువెళుతున్నామనే సంగతి వారు పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమవుతోంది.

Also Read – రేషన్ బియ్యం దొంగలు గప్‌చిప్?

అతను డబ్బు, మంచి పలుకుబడి ఉన్న ఓ రిమాండ్‌ ఖైదీ… బిర్యానీలు పెట్టిస్తాడు… తింటాము… అంతే! అన్నట్లుంది వారి తీరు. ఈ లెక్కన అరెస్ట్ అయిన వైసీపి నేతలకు జైళ్ళలో ఎటువంటి రాజభోగాలు సమకూర్చుతున్నారో ఊహించుకోవచ్చు.

ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్క్షంలో ఉన్నప్పుడు ఆయనని అరెస్ట్ చేసి నానా ఇబ్బంది పెట్టిన పోలీసులు, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారనే ఆలోచన లేకుండా వైసీపి నేతలతో ఈవిదంగా అంటకాగుతుండటం చూస్తే, పోలీసులపై పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు సహేతుకమే అని స్పష్టమవుతోంది. మరి సిఎం చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థని ఏవిదంగా ప్రక్షాళన చేసి గాడిన పెట్టుకుంటారో?