
కూటమి ప్రభుత్వం వైసీపీలో అందగాళ్ళను అరెస్టు చేస్తుంది అంటూ ఆరోపించిన ఆ పార్టీ అధినేత వైస్ జగన్ ఆరోపణలలో వాస్తవాలు ఎంతా అన్నది ఒక్కసారి పరిశీలిస్తే, అసలు జగన్ ఆరోపిస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం వైసీపీ అందగాళ్ళను మాత్రమే అరెస్టు చేస్తుందా లేక జగన్ దృష్టిలో అందగాళ్లుగా భావించిన వాళ్ళకే జగన్ ఓదార్పు దక్కుతుందా అన్న సందేహం కలుగకమానదు.
వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఆయనను జైలుకెళ్లి మరి పరామర్శించారు జగన్, అలాగే పిన్నెళ్లి రామకృష్ణ రెడ్డి విషయంలోనూ, నందిగామ సురేష్ విషయంలోనూ ఇదే రకమైన ఓదార్పు యాత్రలు చేసారు వైస్ జగన్. ఇక వైసీపీ నేతగా చెలామణి అయిన బోరుగడ్డ అనిల్ కు కానీ, పోసాని కృష్ణ మురళి అరెస్టు విషయంలో కానీ ఆ బిడ్డలకు జగన్ ఓదార్పు దక్కలేదు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
అంటే వీరిద్దరూ జగన్ దృష్టిలో అందగాళ్ళు కారు అనా.? లేక ఈ ఇద్దరు ఇంకా వైసీపీ బిడ్డలు గా నమోదు కాలేదా.? పోసాని అరెస్టు తరువాత ఆయన సతీమణి కి ఫోన్ చేసి మరి ‘ఐ విల్ స్టాండ్ విత్ యు’ అమ్మ అంటూ కవరింగ్ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాటమార్చారా.? లేక మడం తిప్పారా.?
లేక ఇదంతా వైసీపీ పెద్దల స్క్రిప్ట్ లో భాగమే అంటూ పోసాని బయటపెట్టిన వైసీపీ బూతు భాగోతాల గుట్టుతో పోసానిని వైసీపీ ఖాతలో నుంచి పక్కకు తప్పించారా.? నాకు బైలు రాకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ కోర్టులో కన్నీరు పెట్టిన పోసాని పట్ల వైస్ జగన్ కు కనికరం లేకపోయిందా.?
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
వైసీపీ ఆత్మ సంతృప్తి కోసం, వైస్ జగన్ అహం చల్లారడం కోసం మనిషిగా పాతాళానికి దిగజారి ప్రవర్తించిన పోసాని పాపాలకు జగన్ ఓదార్పు దక్కకపోవడమే ఆయనకు సరైన శిక్ష అంటున్నారు కూటమి మద్దతుదారులు. ఇన్నాళ్లుగా ఎవరిని నమ్మి నోటికొచ్చిందల్లా వాగాడో ఇప్పుడే అదే నేత కనీసం ఓదార్పు కూడా చూపకుండా నట్టేట్లో ముంచితే పోసానికి చేసిన పాపం చేయాల్సిన పరిహారం రెండిటి మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
అయితే నేడు సిఐడి కస్టడీ లో విచారణ ఎదుర్కున్న పోసానిని, విచారణ పూర్తి చేసుకుని తిరిగి గుంటూరు జైలుకు తరలించారు సిఐడి అధికారులు. అలాగే ఆయన్ని కేసు తాలూకా మరోసారి తమ కస్టడీలోకి కోరే అవకాశం ఉందంటున్నారు విచారణాధికారులు. పవన్, లోకేష్, బాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయిన విషయం తెలిసిందే.