పుష్ప-2లో మన హీరో చెడ్డవాడు..జగన్‌లాగా చాలా తెలివైనవాడు. నమ్ముకున్న వాళ్ళందరికీ దోచిపెడుతున్నాను కదా మంచివాడినే అనుకుంటాడు. కనుక పుష్పరాజ్ సినిమాలో ఎర్ర చందనం దోచేసి స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదించుకుంటే, నిర్మాతలు ప్రేక్షకులను నిలువుదోపిడీ చేసి దోచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.
మా సినిమాని వందల కోట్లు పెట్టి తీశాము కనుక అడ్డుగోలుగా టికెట్ ధరలు పెంచుకుని ప్రజలను దోచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు కోరడం, దానికి ప్రభుత్వాలు తలూపడం రెండూ విచిత్రంగానే ఉన్నాయి.
Also Read – ఏపీలో పర్యాటకం… ఇదిగో శాంపిల్!
వందల కోట్లు పెట్టి ప్రేక్షకులు మెచ్చుకునే అంత గొప్పగా సినిమా తీస్తే వందో వీలైతే రెండు వందల రోజులో ఆడించుకుని పెట్టుబడి, లాభాలు పొందాలి కానీ మొదటి పది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి, దానిపై లాభాలు కూడా వచ్చేయాలనుకోవడం దురాశ కాదా?ఇది ప్రభుత్వాలకు తప్పుగా అనిపించడం లేదా?
మరో విషయం సరస్వతీ నిలయాలుగా పిలవబడే విద్యాలయాలలో సామాజిక స్పృహ కలిగించే సినిమాలో లేదా మన సంస్కృతీ సంప్రదాయాలు లేదా చరిత్రని తెలియజేసే సినిమాలు ప్రదర్శించినా, 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించినా ఎవరూ తప్పు పట్టరు. అది అవసరం కూడా. కానీ ఎర్ర చందంనం స్మగ్లింగ్, హత్యలు, నేరాలు కధాంశంగా తీసిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విద్యాలయాలలో నిర్వహించడం ఎంతవరకు సబబు?ఇది అభిమానులకు ఆగ్రహం కలిగించవచ్చు. కానీ టికెట్ ధరలు పెంచితే మొట్ట మొదట ఖాళీ అయ్యేవి వారి జేబులే కదా?
Also Read – జగన్ అప్పులు చేసిపోతే.. చంద్రబాబు నాయుడు…
ఇంతకీ విషయం ఏమిటంటే, పుష్ప-2 టికెట్ ధరలు పెంచుకోవడానికి బెనిఫిట్ షోస్ ప్రదర్శించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వందో రెండొందలో కాదు ఏకంగా రూ.800. అదీ.. టికెట్ ఛార్జీపై అదనంగా!
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.200 కాగా అదిప్పుడు రూ.1,000లు. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్స్ రేట్ రూ.400కాగా అదిప్పుడు రూ.1,200లు. మూడు వారాల పాటు ఈ దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read – వివేకానంద గురించి జగన్ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వమే ఇంత పెంచుకొని ఇన్ని రోజులు వసూలు చేసుకోవడానికి అనుమటించింది కనుక ఏపీ ప్రభుత్వం కూడా దానితో పోటీ పడుతుందా?లేదా విచక్షణ ప్రదర్శిస్తుందా?