Rajendra Prasad loose talk about David Warner in Robinhood Pre-Release Event

విడుదల కాబోతున్న సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు, హిట్ అయిన సినిమాలకి సంతోషంగా ఫంక్షన్లు జరుపుకొంటున్నప్పుడు, సీనియర్ నటీనటులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు కొంప ముంచుతున్నాయి.

నితిన్‌, శ్రీలీల జంటగా చేసిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. కనుక నిన్న జరిగిన ఈ సినిమా ఫంక్షన్‌కి ఆయన కూడా వచ్చారు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

హైదరాబాద్‌లో ఉండి కూడా ఇటువంటి ఫంక్షన్లకు మొహం చాటేస్తుంటారు పలువురు సినీ ప్రముఖులు. అటువంటప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డేవిడ్ వార్నర్‌ వచ్చినందుకు రాబిన్‌హుడ్ చిత్ర బృందం, అభిమానులు ప్రతీ ఒక్కరూ సంతోషించారు.

ఆయన ఈ కార్యక్రమానికి రావడమే కాదు వేదికపై నితిన్‌, శ్రీలీల, కేతికా శర్మలతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

అయితే ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇదే వేదిక మీద నుంచి డేవిడ్ వార్నర్‌ని ఉద్దేశించి, “ఒరేయ్ డేవిడ్ వార్నరూ నిన్ను క్రికెట్ ఆడమంటే ఇలా అలా మొహం వంకరగా పెట్టి సినిమాలు చేస్తావేమిట్రా?నీకు వార్నింగ్ ఇస్తున్నా,” అంటూ నోటికొచ్చిన్నట్లు మాట్లాడారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఆయనకు అర్దం కాకపోయి ఉండొచ్చు. కానీ ఆయన మొహంలో మారిన ఫీలింగ్స్ చూస్తే రాజేంద్ర ప్రసాద్ తన గురించి చులకనగా మాట్లాడుతున్నారనే విషయం ఆయనకు అర్దమయ్యిందని తెలిసిపోతుంది.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

ఎప్పుడూ చాలా సరదాగా మాట్లాడుతూ అందరినీ అలరించే రాజేంద్ర ప్రసాద్ ఆవిదంగా మాట్లాడేసరికి అందరూ దిగ్బ్రాంతి చెందారు. కానీ ఈ కార్యక్రమానికి ఆయన తాగి వచ్చారని సర్ధి చెప్పుకున్నారు. కానీ మత్తు దిగిపోయిన తర్వాత డేవిడ్ వార్నర్‌ని ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడానని తెలుసుకున్నారు.

కనుక తన అనుచిత ప్రవర్తన, మాటలకు అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూనే, తెలుగు సినిమావాళ్ళంటే డేవిడ్ వార్నర్‌కి చాలా ఇష్టమని, తమకు కూడా ఆయనంటే చాలా ఇష్టమని అందుకే అనుకోకుండా అలా నోరు జారానని, ఇకపై ఎన్నడూ ఇటువంటి పొరపాటు జరగదని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

సినిమా ఫంక్షన్లకు వచ్చినవారు ఇలా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేసి తర్వాత సారీలు చెప్పేస్తే చేసిన తప్పులు రద్దయిపోవు కదా?

ఇటీవల లైలా సినిమా ఫంక్షన్లో పృధ్వీ కూడా వైసీపీ గురించి వాగినందుకు ఇలాగే ఆ సినిమాని బాయ్ కాట్ చేయమని సోషల్ మీడియాలో ఉద్యమం జరిగినప్పుడు విశ్వక్‌ సేన్‌, దర్శక నిర్మాతలు ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు చెప్పుకున్నారు.

అయినా ఆ సినిమా పోయింది. ఆ సినిమా బాగోకపోవడం వల్లనే ఫ్లాప్ అయ్యింది కానీ అదే.. ఆ సినిమా చక్కగా ఉండి ఇటువంటి కారణం వలన ఫ్లాప్ అయితే? ఆ సినిమా నిర్మాత నష్టపోతారు కదా?

రాబిన్‌హుడ్ ట్రైలర్‌ని బట్టి చూస్తే సినిమా బాగానే ఉంటుందనిపిస్తోంది. సినిమాలో కామెడీ, రొమాన్స్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్, ముఖ్యంగా కేతికాశర్మ చేసిన ‘అదిదా సర్‌ప్రీజు..’ ఐటం సాంగ్‌ అన్నీ చక్కగా కుదిరాయి. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ మాటలను క్రికెట్ అభిమానులు సీరియస్‌గా తీసుకొని బాయ్ కాట్ చేస్తే?




కనుక సినీ ఫంక్షన్స్ నిర్వహించేవారు ముందుగానే ఇటువంటివారిని గుర్తించి దూరంగా ఉంచడం లేదా వారి నోటికి ముందే తాళం వేసి తెచ్చుకోవడం మంచిది.