Ram Gopal Varma not lessthan narada

హిందూ పురాణాలలో దేవతలు, రాక్షసులతో సమానంగా వినిపించే మరోపేరు నారదుడు. ముల్లోకాలు తిరుగుతూ అందరి మద్య గొడవలు పెడుతుండేవాడు. కానీ వాటి వలన అందరికీ మేలు కలుగుతుండేది. కనుక భగవంతుని లీలలో భాగంగానే ఆయన చర్యలను చూసేవారు.

ఇప్పుడు లోకంలో అటువంటి నారదులకు కరువేమీ లేదు. మనకైతే రాంగోపాల్ వర్మ ఉన్నారు. ఇంతకాలం పోలీస్ కేసులకు జడిసి అజ్ఞాతంలోకి వెళ్ళిన వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఉపశమనం లభించడంతో మళ్ళీ వర్మలో నారదుడు విజృంభిచేస్తున్నాడు. ఇవాళ్ళ తన శైలిలో రెండు ట్వీట్స్ వేశారు.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

ఒకదాని సారాంశం సుబ్బారావు హోటల్లో ఇడ్లీల ధర ఎక్కువ తినడం మానేస్తే ఎవరికి నష్టం?బ్రాండెడ్ ఉత్పత్తులు ధరలు అంతగా ఉంటే పట్టించుకోని జనాలు, అటువంటి ప్రొడక్ట్ అయిన పుష్ప-2 టికెట్ ధరలు చూసి ఏడ్పులు దేనికి?

రెండోది మెగాస్టార్ చిరంజీవి కంటే అల్లు అర్జునే గొప్ప. ఎందువల్ల అంటే పుష్ప-2 సినిమా యావత్ ప్రపంచంలో విడుదలవుతోంది కనుక. పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ అక్షరాల 287 కోట్ల 36 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారు కనుక.

Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!

రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప-2 టికెట్స్ బెనిఫిట్ షో టికెట్ ధరలపై అదనంగా రూ.800 పెంచుకోవడానికి అనుమతించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

మరే సినిమాకి లేనంతగా పుష్ప-2కి ఇంత పెంచుకునేందుకు ఎందుకు అనుమతించాయి ప్రభుత్వాలు? అభిమానుల వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని అల్లు అర్జున్‌ చెప్పుకుంటున్నప్పుడు, వారికి సగం ధరకో లేదా ఉచితంగానో సినిమా చూసేందుకు అవకాశం కల్పించాలి కానీ తన అభిమానులనే ఈవిదంగా దోచుకోవడం ఏం న్యాయం?వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ

అయితే ఆ అభిమానులే ఈ వాదనలపై మండిపడుతూ థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు కనుక కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని ఊరుకోవలసిందే. అయిష్టంగానైనా వర్మ వాదనలను అంగీకరించాల్సిందే.

పుష్ప-2 కలెక్షన్స్, అల్లు అర్జున్‌ పారితోషికం వగైరాలతో బహుశః మరే సినిమాని, హీరోని పోల్చి చూడలేకపోవచ్చు. కానీ కేవలం అవి మాత్రమే ఓ హీరోని మెగాహీరోగా చేయలేవు.

మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల సినీ చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన వేసిన పునాదిపైనే అల్లు అర్జున్‌తో సహా మెగా హీరోలందరూ భవంతులు నిర్మించుకున్నారని అందరికీ తెలుసు. కనుక ఎవరు మెగా? అని ఎవరూ తీర్పులు చెప్పవలసిన అవసరమే లేదు. నటీనటుల చరిత్ర, ప్రజలు, అభిమానులు, ప్రేక్షకులే మెగా హీరో ఎవరో నిర్ణయిస్తారు.

ఇక్కడ వర్మ తెలివిగా ఇటువంటి వాదనలతో అల్లు అర్జున్‌ అభిమానులని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు. తద్వారా అల్లు అర్జున్‌, ఆయన వెనక ఉన్న పెద్దలు తనకు అండగా నిలిచి ఈ కేసుల బాధ నుంచి విముక్తి కల్పిస్తారని ఆశపడుతున్నట్లున్నారు.

అందుకోసం ఆయన మెగా హీరోలు, అభిమానుల మద్య ఇటువంటి వాదనలతో చిచ్చు రగిలించేందుకు వర్మ వెనకాడటం లేదని స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈవిదంగా ‘అతి’ చేయడం వలననే తనకి ఇన్ని కష్టాలు వచ్చేయనే విషయం నేటికీ వర్మ గ్రహించిన్నట్లు లేదు.