
సినిమా పరిశ్రమలో కష్టానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, లక్ ఫ్యాక్టర్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే హీరో హీరోహిన్ సెంటిమెంట్ల విషయంలో కూడా సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా కథానాయకుల విషయంలో ఈ సెంటిమెంట్ అస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అన్ని ఉన్న అదృష్టం లేక కొంతమంది తారలు వెండితెరకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. అయితే రష్మిక విషయంలో ఆమె హార్డ్ వర్క్ ఎంత సక్సెస్ ను తెచ్చిపెడుతుందో అందుకు ఆమె అదృష్టం కూడా అంతే సాయం అందిస్తుందా అనిపిస్తుంది.
Also Read – కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?
ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, ప్రేక్షకులలో మంచి గుర్తింపును అందుకున్నారు. అలాగే గీతగోవిందం, సరిలేరునికెవ్వరు మూవీ ల విజయాలతో టాలీవుడ్ లక్కీ హీరోహిన్ గా మారిపోయారు రష్మిక.
ఇక పుష్ప, యానిమల్ మూవీస్ తో నేషనల్ క్రష్ గా రష్మిక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాపులర్ అయ్యారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక పుష్ప – 2 తో మరింత క్రెజ్ ను దక్కించుకున్నారు. దీనితో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో 1000 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమా సంఖ్య అలా అలా పెరుగుతూ పోతుంది.
Also Read – విదేశీ భాషలు నేర్చుకోవడం గొప్ప కానీ హిందీ కాదా?
ఇక ఇప్పుడు ఈ అమ్మడి తాజా చిత్రం కుభేర కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో రష్మిక నక్క తోక తొక్కరా అంటూ సోషల్ మీడియాలో ఆ అమ్మడు అదృష్టం మీద చర్చ నడుస్తుంది. అయితే రష్మిక చిత్రంలో నటించడంతో తన పని పూర్తయ్యింది అనుకోకుండా ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో కూడా అంటే శ్రద్ద పెడతారు.
దీనితో ఈ అమ్మడు ఆ విజయాలకు పూర్తి అర్హురాలు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఒక్కో సందర్భంలో కథానాయకుల రిలేషన్స్ మీద ప్రచారమవుతున్న ప్రచారాల ఆధారంగా కూడా ఆ హీరోహీన్ల గ్రాఫ్ ఆధారపడుతుంది. కానీ ఈ విషయంలో కూడా రష్మిక అందుకు మినహాయింపు పొందారనే చెప్పాలి.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రను ఎంచుకుంటూ, ప్రతి పాత్రలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, నిర్మాతల పాలిట కుబేర మంత్రంగా మారారు రష్మిక. ఇక తన తాజా చిత్రం కుభేర విడుదలైన మొదటి ఆట నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడం తో పాటుగా తానూ నటించిన సమీర పాత్ర కు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
కుబేర చిత్ర యూనిట్ కూడా తమ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ చిత్ర విజయంతో రష్మిక ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ మూవీ పడినట్లయింది. ప్రస్తుత పరిస్థితులలో ఒక స్టార్ హీరో కు కూడా దక్కని వరుస విజయాలు ఈ అమ్మడు అందిపుచ్చుకోవడం అంటే రష్మిక సో లక్కీ అనకతప్పదేమో.